ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
ముదినేపల్లి పోలీసుస్టేషన్ SHO గా వీర భద్రరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ పోలిస్ స్టేషన్ నందు ఎస్సై గా విధులను నిర్వర్తిస్తూ… ముదినేపల్లికి బదిలీపై వచ్చారు. ఇంతకు మునుపు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన డి. వెంకట్ కుమార్ కైకలూరు టౌన్ కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా వీర భద్రరావు మాట్లాడుతూ.. ముదినేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
అలాగే, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.