The Desk…Mudinepalli : కుమార్తె కళ్ళల్లో ఆనందం కోసం..!!

The Desk…Mudinepalli : కుమార్తె కళ్ళల్లో ఆనందం కోసం..!!

ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : THE DESK :

ఏడుకొండల స్వామివారిని దర్శించుకోవాలంటే ఏలూరు జిల్లా వెళ్లాల్సిందే..!!

ముదినేపల్లి లో వెలసిన ఏడుకొండలు

కుమార్తె కళ్ళల్లో ఆనందం కోసం..!!

రాష్ట్రం సుభిక్షం కోసం..!!

అమరావతి పునర్నిర్మాణం కోసం..!!

మరోసారి రాజశ్యామల యాగం హోమం చేయనున్న ఆంబుల వైష్ణవి

వివరాల్లోకి వెళితే..!!

చంటి బిడ్డకు తల్లి చందమామను చూపించి ఆహారం పెట్టి చందమామ ఇదిగో అంటూ అద్దంలో చూపించి తన బిడ్డకు ఏది కావాలో అని.. ఆ మాతృమూర్తి ఎలా ఆరాటపడుతుందో.. అలానే ముదినేపల్లి లోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ మనోజ్ కూడా తన కుమార్తె కోసం చేసిన ఒక ఆలోచనే సాక్షాత్తు తిరుమల తిరుపతి స్వామివారైనా ఏడుకొండలతో కూడిన స్వామివారి స్వరూప్యాన్ని ఇంటి ముందు సాక్షాత్కరింపచేశారు.

ఆదర్శనీయుడు డాక్టర్ మనోజ్..

ఎంతోమంది వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేపడ తుంటారు… కొంతమందయితే స్వార్థం కోసమో, రాజకీయం కోసమో, పలుకుబడి కోసమో, ప్రజల మెప్పు కోసమో, స్వలాభం కోసమో కొన్ని కార్యక్రమాలు చేపడతారు ఆగిపోతారు…అయితే డాక్టర్ మనోజ్ అందుకు భిన్నమనే చెప్పాలి.

ఎన్నో సంవత్సరాల నుండి నిజాయితీగా, నిస్వార్ధంగా, కల్మషం లేకుండా, కుల మతాలకతీతంగా …నిరు పేదలకు.. ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన వారికి.. నిస్సహాయులకు.. అనాధలకు.. చనిపోయి తన ఆప్తులను పోగొట్టుకున్న వారి కుటుంబాలకు, విద్యా సంస్థలకు, రోగులకు, వ్యాధిగ్రస్తులకు, అనాధ శవాలను మోస్తూ.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో, ఎంతమందికో నిత్యం, ప్రతినిత్యం లెక్కకు మించి వెలకట్టలేని సహాయాలు చేస్తూ.. గొప్ప మనసున్న మనిషనిపించుకున్నారు డా.మనోజ్.

నిస్వార్ధంగా ఇప్పుడు మరో ముందడుగు వేసి రాష్ట్రం యావత్తు బాగు కోసం… తను పడే తపన, ఆరాటం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. భావితరాల వారు సైతం వీరిని ఆదర్శంగా తీసుకుని కొంతమందయినా మారి వారిలో కదలిక వచ్చి ఇతరులకు సహాయ సహకారాలు అందించాలని తండ్రి, కుమార్తెల తపన.

మరలా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా…

సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం వీరి కుమార్తె అంబుల వైష్ణవి చేస్తున్న కార్యక్రమాలను, అమరావతి నిర్మాణానికి ఎన్నో లక్షలు రూపాయలు ఖరీదు చేసే తమ పొలాన్ని సైతం అమ్మిన వీరి ధాతృత్వాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొన్నారంటే అతిశయోక్తి లేదు.

సేవే కాదు భక్తిలోనూ..!!

సేవా కార్యక్రమాలలోనే కాదు, భక్తి విషయంలో కూడా తగ్గేదే లేదంటూ… ఇంటి వద్ద ఏడుకొండల నిర్మాణాన్ని చేపట్టారంటే రాష్ట్రాభివృద్ధి కోసం కూడా…

కుమార్తె కళ్ళల్లో ఆనందం కోసం..

ముదినేపల్లి లో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ హాస్పిటల్ (ఇంటి) ఆవరణలో డాక్టర్ మనోజ్ కుమార్తె, అంబుల వైష్ణవి చిన్నతనంలో తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్ళమని తన తండ్రిని కోరగా…తండ్రి డాక్టర్ మనోజ్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది అని, మరియు తల్లి లేని పిల్ల కదా అని, అలనా – పాలన చూసుకోవాలని తన కోరిక మేరకు వినూత్నంగా ఆలోచించి… కుమార్తె వైష్ణవి కోసం ఏడుకొండలు లాంటి నమూనాన్ని ముదినేపల్లిలోని ఆసుపత్రి ఆవరణలోనే (ఇంటి వద్ద) నిర్మాణాన్ని చేపట్టి ఔరా అనిపించుకున్నారు. అప్పటినుండి బాలిక అయిన వైష్ణవి ఆ ఏడుకొండలు దగ్గర ఆడుకుని, నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉండేది.

అటు హాస్పటల్ వద్దకు వచ్చే పేషెంట్లు సైతం మరియు ఆ గ్రామ ప్రజలు, అటుగా వెళ్లేవారు మరియు తిరుపతి వెళ్లలేని వారు అందుబాటులో ఉన్న ఈ ఏడుకొండలు తిరుపతి దేవస్థానం లాంటి ఈ ఆలయాన్ని సందర్శించి, ఏడుకొండల చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూజలు చేస్తూ ఉంటారు.ఈ ఏడుకొండలు దేవస్థానం వద్ద వైష్ణవి 40 రోజులు సమైక్యాంధ్ర కోసం అప్పట్లో దీక్ష చేయగా… అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేస్తున్న బాలిక వైష్ణవి వద్దకు వచ్చి ఆశీర్వదించారు.ఇదే ఏడుకొండల వద్ద నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగ హోమం చేసింది డాక్టర్ మనోజ్ కుమార్తె వైష్ణవి.

హోమానికి చంద్రబాబు దంపతులు రావాలని వైష్ణవి ఆశ

ఇప్పుడు మరలా ఈ కార్తిక మాసంలో నిర్వహించబోయే రాజశ్యామల యాగ హోమం చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. అమరావతి నిర్మాణం త్వరితగతిన ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని ఒకరోజు జరగబోయే ఈ పూజా యాగ హోమ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు వచ్చి తనను ఆశీర్వదించాలనేది అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని వైష్ణవి ఆశ.

✍️ ✍️ THE DESK

EDITOR – VISWANATH