The Desk… Amaravati : నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ మొక్కుతా..‼️ – CBN

The Desk… Amaravati : నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ మొక్కుతా..‼️ – CBN

🔴 అమరావతి : THE DESK :

“తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కారం చేయాలి. నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ అదేవిధంగా చేస్తా’.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పదేపదే చెబుతున్న మాట ఇది.

ఆయన చెప్పినట్లే శనివారం ఏకంగా చేసి చూపించారు. రాజధానిలో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు కాళ్లకు ఓ వ్యక్తి మొక్కారు.

వెంటనే చంద్రబాబు ‘నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా’ అంటూ… కొంచెం ఒంగి ఆ వ్యక్తి కాళ్లు పట్టుకోబోయారు. ఈ హఠాత్పరిణామంతో ఆ వ్యక్తి కంగుతిన్నారు.

www.thedesknews.net