The Desk…Eluru : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరో ఇరువురు అరెస్ట్

The Desk…Eluru : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరో ఇరువురు అరెస్ట్

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

కాల్ మనీ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరో ఇరువురు అరెస్ట్ చేసి శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ కిషోర్.

ఏలూరులో పేదలను, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని, వారికీ అధిక వడ్డిలకు డబ్బులు ఇస్తూ ఇస్తానుసారంగా వడ్డీలు వసూలు చేస్తున్న ప్రధాన నిందితుడైన ఏలూరు నగరానికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి, అల్లాడ లావణ్య, వీరమల్ల రాజేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు వీరందరిపై 7 కేసులు నమోదయ్యాయి.

బాధితులు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చు. లేదంటే ప్రతివారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పిన ఎస్పీ కిషోర్.

అధిక వడ్డీలకు వ్యాపారం చేసే వ్యక్తులకు ఉద్యోగ గుణపాఠంగా మారాలి. అమాయక ప్రజలను పీడిస్తూ వారి వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తే అటువంటి వ్యాపారస్తుల ఆస్తులు కూడా కోల్పోయే విధంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ఎస్పి. ప్రభుత్వ ఉద్యోగులు వడ్డి వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.