ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలామ్ 93వ జయంతి వేడుకలు మంగళవారం తెదేపా నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో గల అబ్దల్ కలామ్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్చేసి చిన్నారులకు పంచిపెట్టారు.
కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శీ పూలరాజీ, జిల్లామైనార్టీ కార్యదర్శీ సయ్యద్ బాషీద్, మండలపార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గఫూర్, తెలుగు దేశం పార్టీ సినియర్ నాయకుడు వేములపల్లి కారుణ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు పడమట వాసు, బాజానీ ఖాన్, హబీబ్ సుబానీ, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.