The Desk…Hyderabad : విజయవాడ తరహాలో హైదరాబాదులో భారీ మోసం…కోట్ల రూపాయల మేర..!!..!! డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ MD అరెస్ట్‌..

The Desk…Hyderabad : విజయవాడ తరహాలో హైదరాబాదులో భారీ మోసం…కోట్ల రూపాయల మేర..!!..!! డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ MD అరెస్ట్‌..

Telangana : హైదరాబాద్ : THE DESK :

హైదరాబాద్ నగర పోలీసులు అక్టోబర్ 10, గురువారం.. DKZ టెక్నాలజీస్/డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లను అరెస్టు చేశారు. అలాగే కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఆ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ.. దాదాపు 17500 మంది ఇన్వెస్టర్లను 229 కోట్ల రూపాయల మేర మోసం చేసింది. కంపెనీలో రూ. 2.74 కోట్లు పెట్టుబడి పెట్టిన హైదరాబాద్‌ వైద్యుడి ఫిర్యాదుపై విచారణ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

తన పెట్టుబడులపై అధిక రాబడిని ఇస్తానని హామీ ఇచ్చిన సంస్థ ప్రతినిధులు అష్ఫాక్ రాహిల్, మహ్మద్ ఇక్బాల్, సయ్యద్ ఉమర్ అహ్మద్, మోయిజ్, నజీర్, బిలాల్‌లు తనను మోసగించారని అతను చెప్పాడు.

అరెస్టు చేసిన నిందితులను డికెజెడ్ టెక్నాలజీస్/డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ అష్ఫాక్ రాహిల్, డైరెక్టర్ సయ్యదా ఐషా నాజ్‌గా గుర్తించారు.

పోలీసుల ప్రకారం.. వచ్చిన ఆరోపణలపై స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించారు. ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కంపెనీ ఓనర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో, డీకేజెడ్/డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాదాపూర్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 1.7 కోట్ల రూపాయల నగదు, ఇన్వెస్టర్ల రిజిస్ట్రీ, బ్యాంక్ చెక్ బుక్‌లు, 13 ల్యాప్‌టాప్‌లు, కంపెనీ లెటర్‌హెడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరుగుతోందని, మొత్తం ఎంత మోసం చేశారనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న మిగతా బోర్డు సభ్యులు, ఇతర కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.