ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK Reporter :
ముదినేపల్లి ఎంపీడీవో గా యద్దనపూడి రామకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆయనతో పాటు ఈవోపీఆర్డి గా బి. కిషోర్, ఏవో గా ఎం.వి. రమణా రావు, ఏటీపీఆర్ గా అబ్దుల్ పాషా లు బాధ్యతలు చేపట్టారు.
ఇంతకు మునుపు ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన పి. మల్లీశ్వరి నందివాడకు బదిలీపై వెళ్లగా.. పామర్రు ఎంపీడీవో గా విధులు నిర్వహించిన రామకృష్ణ బదిలీపై ముదినేపల్లి వచ్చారు.
సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.