ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పై చీటింగ్ కేసు నమోదు
మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ల నాని.. మరికొందరిపై కేసు.. ఏలూరు 3 టౌన్ లో..‼️
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైకాపా నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్ కు చెందిన అవుటుపల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.
4వ అంతస్తులో ప్రచారం ముగించుకొని కిందకు దిగేందుకు అందరూ లిఫ్ట్ ఎక్కారు. అది ఫెయిలై కిందకు పడిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు.
ఈ క్రమంలో నాగమణికి గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సచివాలయ వాలంటీర్లు కూడా ఉన్నందున ఎన్నికల సంఘంతో ఇబ్బందులు వస్తాయని విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.
బాధితురాలు నాగమణికి వైద్య ఖర్చులు పెట్టుకుంటామని, ప్రమాద బీమా వచ్చేలా చేస్తామని, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చారు. తరువాత పట్టించుకోలేదు. నష్టపరిహారం కూడా రాలేదు.
బాధితురాలు గట్టిగా అడగగా నాయకులు బెదిరించారు. తరువాత నష్టపరిహారం ఇవ్వకపోగా.. పట్టించుకోక పోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీరా బాబు, జీలూఖాన్, కురెళ్ల రాం ప్రసాద్, ప్రైవేటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీలపై కేసు నమోదు చేశారు.