ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కింద ఇచ్చిన భూములను వెరిఫికేషన్ చేయాలి…
వరద, సహాయక చర్యల్లో సమర్ధవంతంగా పనిచేసిన రెవిన్యూ, ఇతర శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
జిల్లాలో రెవిన్యూ పరంగా కోర్టు కేసులను తక్షణ పరిష్కారానికి రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
శనివారం స్ధానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో రెవిన్యూ డివిజనల్ అదికారులు, మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో రెవిన్యూకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసులు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ఇటీవల వచ్చిన వరద నష్టానికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
రెవిన్యూశాఖకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ఆర్డివోలు, తహశీల్దార్లు రిట్ పీటీషన్ డైరెక్షన్, కోర్టుధిక్కారణ కేసులు, డాక్యూమెంట్ మేనేజ్ మెంట్, ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.
కోర్టు కేసులు స్టేజివారీ రిపోర్టుల నివేదికను కలెక్టరేట్ కు అందజేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కింద ఇచ్చిన భూములను వెరిఫికేషన్ చేసి నివేదికను సమర్పించాలన్నారు. ఇటీవల జిల్లాలో వరదలు కారణంగా నష్టానికి సంబంధించి పూర్తి నివేదికను త్వరితగతిన కలెక్టరేట్ కు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లా రెవిన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో రేయి, పగలు విధులు నిర్వహించారని మరి ముఖ్యంగా ఏలూరు ఆర్డివో ఎన్ఎస్ కె ఖాజావలి పరిధిలోని కైకలూరు, కొల్లేరులో వచ్చిన వరద, అలాగే నూజివీడు ఆర్డివో వై భవానీశంకరి నూజివిడు వరదను ఎదుర్కొనడంలో వీరి ఇరువురు మంచి పనితీరును కనబరిచారన్నారు.
వరదల సహాయక చర్యల్లో రెవిన్యూ యంత్రాంగంతోపాటు సమర్దవంతంగా విధులు నిర్వహించిన ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రత్యేకంగా అభినందించారు.
సమావేశంలో డిఆర్ఓ డి. పుష్పమణి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.