The Desk…Aagiripalli : పల్లెనిద్రలో పోలీసు అధికారులు

The Desk…Aagiripalli : పల్లెనిద్రలో పోలీసు అధికారులు

ఏలూరు జిల్లా : ఆగిరిపల్లి : వడ్లమాను : THE DESK :

ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ఆదివారం నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్సై శుభ శేఖర్, ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా ఆగిరిపల్లి మండలంలో ఉన్న వడ్లమను గ్రామములో అధికారులు పల్లెనిద్ర చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు గ్రామస్తులతో సమావేశమును నిర్వహించారు.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించే క్రమంలో కొంత మంది సైబర్ నేరగాళ్లు ప్రజల యొక్క అవగాహన లోపం వలన సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

బ్యాంకు ల నుండి ఒక మెసేజ్ ని పంపించి మీ అకౌంట్కు ఉన్నటువంటి ఆధార్ కార్డును త్వరగా అప్డేట్ చేయాలని, సదరు ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి పంపించినటు వంటి లింక్లను ఉపయోగించాలని వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, అటువంటి సందర్భాలలో ప్రజలకు అసలు ఆ సదరు బ్యాంకులో అకౌంట్ ఉన్నదా లేదా అని గ్రహించాలని ఎటువంటి మెసేజ్లను బ్యాంకు నుండి అటువంటి లింకులు రావని గ్రహించాలన్నారు.

అతి పెద్ద కంపెనీలు నిర్వహించిన డ్రాలో మీకు బహుమతి వచ్చినట్లు దానిని పొందాలంటే మీ బ్యాంక్ అకౌంట్ లేదా మీకు సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది దాన్ని తెలియచేసిన ఎడల మీకు పెద్ద బహుమతి వస్తుందని ఆశచూపిస్తూ వచ్చే మెసేజ్లు పట్ల ఆకర్షితులు అయితే మీ బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులు, మీ విలువైనటు వంటి సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లు తస్కరించే అవకాశముందన్నారు. అటు వంటి మెసేజెలకు, యాప్ లకు స్పందించవద్దని, ఎవరైనా మీ ఫోన్ లకు మెసేజ్ లు పేడితే వెంటనే సైబర్ నేరాలు అన్వేషించే 1930కు తెలియ చేయాలని, వెంటనే వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారని పోలీసులు తెలియచేశారు.

గ్రామాలలో చిన్న చిన్న సమస్యలను గురించి చర్చించుకుని అందరూ సర్దుకు పోతే సమస్య పరిష్కారం అవుతుందని, సమస్యను జటిలం చేసే వారి వద్ద కాకుండా పోలీసులను సంప్రదిస్తే, సమస్య ఆదిలోనే పరిష్కారమయ్యి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు తగిన చర్యలు తీసుకుంటారన్నారు.

ప్రజలు ఆపద సమయాలలో 112 కు ఫోన్ చేసిన ఎడల సుమారు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో పోలీసులు సహాయ సహకారాలు అందిస్తారన్నారు.దొంగతనాల నివారణ కొరకు గ్రామాలలో కొత్త వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియ చేయాలని, అలాగే గ్రామాలలో దొంగతనాలు నివారణ కొరకు పోలీసులు అటువంటి వ్యక్తుల వివరాలను సేకరిస్తారన్నారు.

రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ను విధిగా ధరిస్తే రహదారి ప్రమాదాలను నివారించవచ్చని, ప్రమాదం జరిగితే ప్రాణ రక్షణ కలిగిస్తుందన్నారు.

కొత్త చట్టాల పట్ల, అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి, గంజాయి మత్తు పదార్థాలు, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో పోలీసులకు సమాచారం అందిస్తే అక్రమ రవాణాను అరికడతామని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలియజేశారు.