The Desk…Kaikaluru : స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి : రామవరం గ్రామస్థుల విన్నపం

The Desk…Kaikaluru : స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి : రామవరం గ్రామస్థుల విన్నపం

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : మండలంలోని రామవరంలో 100 మంది విద్యార్థులు కలిగిన రామవరం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వేరే స్కూళ్ళకు బదిలీ చేయడం వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని రామవరం గ్రామ ప్రజలు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను స్థానిక పాఠశాలలో కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు. 3వ తరగతి నుండి సబ్జెక్టు వారి విద్యను అందించవలసిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వేరే స్కూళ్ళకు బదిలీ చేసి, ఆ స్థానంలో ఎస్జీటిలను వేశారు, అందువల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, సబ్జెక్టు పరంగా విద్యను అందించవలసిన అసిస్టెంట్ పోస్టులను కొనసాగించాలని ఎస్ఎంసి ఛైర్మన్ గూట్ల మణి జిల్లా విద్యాశాఖాధికారికి, ఏలూరు జిల్లా కలెక్టర్ కు, ఎంపిడిఓ కు, అలాగే ఎంఈవో కు వ్రాతపూర్వకంగా కోరిన ఫలితం లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తీసేసి ఎస్జీటి లు వేస్తే నాణ్యమైన విద్య ఎలా అందుతుంది. గ్రామంలో 90శాతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. కాబట్టి వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించుటకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించాలని స్కూల్ యాజమాన్య కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించాలని కోరుతున్నారు.