The Desk…Mandavalli : ప్రభుత్వం కొల్లేటి వాసులకు రూ.10వేలు వేట నిషేధ భృతి ప్రకటించాలి : YCP ఎమ్మెల్సీ జయమంగళ డిమాండ్

The Desk…Mandavalli : ప్రభుత్వం కొల్లేటి వాసులకు రూ.10వేలు వేట నిషేధ భృతి ప్రకటించాలి : YCP ఎమ్మెల్సీ జయమంగళ డిమాండ్

ఏలూరు జిల్లా : మండవల్లి : THE DESK :

ముంపు గ్రామాల్లోని ప్రజలందరికీ నిత్యవసర సరుకులు అందజేయాలి

పెనుమాక లంక గ్రామ పర్యటనలో ఎమ్మెల్సీ జయమంగళ

గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుడమేరు నుండి భారీ ఎత్తున వరద వచ్చి కొల్లేరు గ్రామాలు ముంపునకు గురికావడంతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న ముంపు గ్రామాల మత్స్యకారులకు ఒక నెల రూ.10 వేలు వేట నిషేధ భృతి ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ డిమాండ్ చేశారు.

మంగళవారం మండలంలోని మణుగులూరు గ్రామం పెద్దడ్లగాడి నుండి పెనుమాకలంక గ్రామానికి మండవల్లి తాసిల్దార్, ఎండిఓ, ఎస్ఐలతో బోటు ప్రయాణం చేసి ముంపునకు గురైన ప్రాంతాలను జయమంగళ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయిన ఇల్లే కాకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామస్తులందరికీ నిత్యవసర సరుకులు తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు.

సముద్రపు వేటకు వెళ్లకుండా నిషేధభృతి ఎలా అందిస్తారో అలాగే కొల్లేటివాసులకు గత 15 రోజులుగా వేట నిషేధించడంతో వారికి కూడా వేట నిషేధభృతి ఒక నెల రూ 10 వేలు ప్రకటించి, మత్స్యకార లైసెన్స్ ఉన్నవారికే అందజేయాలని కోరారు.

అనంతరం గ్రామ కమ్యూనిటీ హాల్ నందు గ్రామస్తులందరూ కలిసి వారి ఇబ్బందులను తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కలెక్టర్ వెట్రి సెల్వికి ఫోన్ చేసి గ్రామస్తులకు తక్షణమే బోటు సదుపాయం ఏర్పాటుచేసి రోజుకు రూ 5 వేలు అందజేయాలని తెలిపారు.

ఈ పర్యటనలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, సర్పంచ్ నాగరాజు, తదితర పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.