ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
కొల్లేరు వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సోమవారం మండలంలోని పలు ముంపు ప్రాంతాలలో ఆయన పర్యటించారు.
ఆలపాడు నుండి కొల్లేటికోట వెళ్లే రహదారి నీట మునిగింది. ఈ క్రమంలో కామినేని శ్రీనివాస్ ప్రయాణిస్తున్న వాహనం పందిరిపల్లిగూడెంలో వెళుతుండగా దారి కనిపించక కొల్లేరు వైపు వెళ్ళగా బొలెరో ఒకవైపుగా ఒరిగింది.
దీంతో అధికారులు, కూటమి నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేను ఒరిగిన వాహనం నుండి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే కామినేని కి ప్రమాదం తప్పిందన్న వార్త తెలియడంతో నియోజకవర్గ కూటమి నాయకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.