తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : THE DESK :
నివాసిత ప్రాంతాల్లోని ప్రజలు రాత్రుళ్ళు చీకటిగా వున్న ప్రాంతంలోనికి వెళ్ళవద్దు..
ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలి..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం..
అటవీ శాఖసిబ్బంది, పోలీస్ సిబ్బంది నివాసిత ప్రాంతాల్లో ప్రహరాకాస్తున్నారని.. చిరుత సంచారం పై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని, ఎవరైనా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫారెస్ట్ అధికారి(ఎఫ్ఏసి) ఎస్.భరణి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఆమె మాట్లాడుతూ… రాజమహేంద్రవరంలో చిరుత సంచారం పై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫొటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్ లను నమ్మవద్దు, భయపడ వద్దన్నారు.
ప్రజలు నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రుళ్ళు చీకటిగా వున్న ప్రాంతంలోనికి వెళ్ళవద్దన్నారు.
ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో ప్రహర కాస్తున్నారన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్ లు లా అండ్ ఆర్డర్ పరిధిలోనికి వస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇటువంటి ఫేక్ మెసేజ్ లు చూసినవారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని ఎఫ్ఏసి కోరారు.