The Desk… Kaikaluru : కొల్లేరు లంక గ్రామాలకు  పొంచి ఉన్న వరద ముప్పు

The Desk… Kaikaluru : కొల్లేరు లంక గ్రామాలకు పొంచి ఉన్న వరద ముప్పు

🔴 BREAKING : ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

కొల్లేరు సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు నుంచి వచ్చే వరదలు పెరగటం వలన కొల్లేరుకు వరద ఉధృతి పెరిగి ఉప్పుటేరు నుంచి వరదనీరు సముద్రంలో కలుస్తుంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చటం వలన కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతుంది. ఉధృతిలో చిక్కుకున్న లంక గ్రామాలు మండవల్లి, కొవ్వాడలంక, తక్కెళ్ళపాడు, ప్రత్తిపాడు, పిల్లిపాడు, ఆటపాక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్నాయి .

చినఎడ్ల గాడి వంతెన దగ్గర నాలుగు అడుగులమేర నీరు చేరటంతో వాహనాలు వెళ్లకుండా అప్రమత్తం చేసిన పోలీసులు.

రాకపోకలను నిలిపివేసిన పోలీసులు..!!

www.thedesknews.net