The Desk…Ghantasala : పంటనష్ట అంచనాలను సమర్ధవంతంగా నిర్వహించాలి : తహసీల్దార్ బి. ప్రసాద్ — 33 శాతం పైగా పంట నష్టపోతేనే పరిగణలోకి : ఏవో కె. కృష్ణ

The Desk…Ghantasala : పంటనష్ట అంచనాలను సమర్ధవంతంగా నిర్వహించాలి : తహసీల్దార్ బి. ప్రసాద్ — 33 శాతం పైగా పంట నష్టపోతేనే పరిగణలోకి : ఏవో కె. కృష్ణ

కృష్ణా జిల్లా : ఘంటసాల : THE DESK:

ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన పంటల అంచనాలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించాలని ఘంటసాల మండల తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ అన్నారు. అధిక వర్షాలకు ప్రభావితమైన పంటల నష్టం తుది జాబితాను రూపొందించడానికి ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గ్రామస్థాయి, మండల స్థాయి, డివిజనల్ స్థాయి బృందాలు పంట నష్టం తుదిజాబితాలను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి బృందంలో గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి తుది నివేదికను రూపొందిస్తారన్నారు.మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయశాఖ అధికారి ఉంటారని, గ్రామస్థాయి బృందం నివేదికలను పర్యవేక్షించటం, సమస్యలను పరిష్కరించి సకాలంలో నివేదికలు రూపొందించేలా పర్యవేక్షిస్తారని చెప్పారు. మండల వ్యవసాయ శాఖ అధికారి కె.మురళీ కృష్ణ మాట్లాడుతూ 33 శాతం పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరించి 34 అంశాలతో కూడిన పూర్తి సమాచారంతో తుది నివేదికలు రూపొందిస్తారని, ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు పంట నష్టంను పరిగణలోకి తీసుకుంటారని అన్నారు. కౌలు కార్డులున్న కౌలు రైతుల సమాచారాన్ని ఆర్బికే లోని గ్రామ వ్యవసాయ సహాయకులకు అందించాలన్నారు. పంట నష్టం అంచనాలను ఈ నెల 10వ తేదీకి పూర్తి చేసి ఆయా రైతు భరోసా కేంద్రాల నోటీసు బోర్డులలో 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ముసాయిదా జాబితాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఏమైన అభ్యంతరాలు ఉంటే పరిశీలించి 17వ తేదీన తుదిజాబితాను జిల్లా స్థాయి అధికారులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డీటీ పి.శ్రీనివాసరావు, వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు.