The Desk…Eluru : మొబైల్ టీం ఏర్పాటు – వినూత్న ఆలోచనతో..‼️ పారిశుద్ధ్య నిర్వహణకు సంచార బృందం : డీపీవో

The Desk…Eluru : మొబైల్ టీం ఏర్పాటు – వినూత్న ఆలోచనతో..‼️ పారిశుద్ధ్య నిర్వహణకు సంచార బృందం : డీపీవో

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

పారిశుద్ధ్య నిర్వహణలో సరి కొత్త కార్యక్రమానికి నాంది పలికామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. స్థానిక డీపీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య సంచార బృందాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులతో సంచార బృందాన్ని ఏర్పాటు … జిల్లాలో అవసరమైన చోట సేవలు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ బృందంలో 13 మంది సభ్యులుంటారని, వారిలో ఒక పారిశుద్ధ్య పర్యవేక్షకుడు, ఇద్దరు ఎలక్ట్రిషియన్లు, ఇద్దరు ప్లంబర్లు, ఇద్దరు ట్యాంకు ఆపరేటర్లు, ఆరుగురు కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్ ఉంటారన్నారు. ఈ విధానం విజయవంతమైతే మరి కొన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని డీపీవో తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.