THE DESK NEWS :ఏలూరు జిల్లా: :చింతలపూడి: సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APUWJ) ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరియు అజీమ్ చారిటీ ఫౌండర్ మానవతా వాది SK ఆజాద్ ఈ రోజు విజయవాడ వరద బాధితులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆసొమ్మును జంగారెడ్డి గూడెం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) రవి చంద్ర, మరియు చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI)రవీంద్ర మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) కుటుంబరావు చేతుల మీదుగా చింతలపూడి జామియా మసీదు కమిటీ మరియు జమాత్ ఇస్లాం హింద్ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ మనిషి కి సాటి మనిషి అండగా ఉండాలి అన్న దృక్పథంతో తన కున్న దాంట్లో APUWJ మరియు అజీమ్ చారిటీ తరుపున చేయూత ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు,మానవతావాదులు పాల్గొన్నారు https://www.thedesknews.net
