🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

స్థానిక 18వ డివిజన్లో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో సచివాలయం వద్ద జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి, ఆయన చేసిన పనులను కొనియాడారు.

ఈ సందర్భంగా 18 డివిజన్ ఇన్చార్జి గరికముక్కు ఆంజనేయులు మాట్లాడుతూ :
మన దేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబుజజగజ్జీవన్ రామ్ 118 జయంతి సందర్భంగా 18వ డివిజన్ సచివాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బాబు జగజ్జీవన్ రామ్ ఆనాటి కాలంలో వివక్ష ఎదుర్కొంటూ కూడా దేశ ఉప ప్రధానిగా ఎదిగరాంటే సామాన్య విషయం కాదని..అదేవిధంగా అప్పటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి.. ప్రధాని రేసులో నిలబడి తన కుమారుడు చేసిన చిన్న తప్పిదం వల్ల ఆయన విలువలు గల మనిషి కాబట్టి ప్రధాని రేస్ నుండి తప్పుకోవడం జరిగిందని, ఇప్పటి రాజకీయ నాయకులకు అలాంటి విలువలు లేవని, కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు నావల్ల జరిగిందని ఆయన ఆ పదవి నుండి తప్పుకోవడం జరిగిందని, విలువలు ఉన్న మనిషి కాబట్టి ఆ పదవిని ఆశించలేదు… లేదంటే ఈ దేశంలో మొట్టమొదటి దళిత ప్రధాని అయి ఉండేవారని.. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కో- ఇన్చార్జ్ రాధమ్మ, సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు,18వ డివిజన్ తెదేపా నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
Eluru Division Celebrates 118th Jayanti of Dr. Babu Jagjivan Ram
The 18th Division in Eluru district grandly commemorated the 118th birth anniversary of Dr. Babu Jagjivan Ram, India’s first Dalit Deputy Prime Minister, at the Divisional Secretariat. Participants garlanded his statue and praised his lifelong contributions to social justice.
Division In-Charge Garikamukku Anjaneyulu highlighted Ram’s inspiring journey: “Overcoming discrimination, he rose to Deputy PM—a remarkable feat. He steadied the Congress party and was in the Prime Ministerial race but stepped aside due to his son’s minor mistake, embodying values rare in today’s politicians. Had he not, he would have been India’s first Dalit PM.” Anjaneyulu lauded organizing the event as a proud moment.
The program saw participation from Co-In-Charge Radhamma, Satyanarayana, MRPS leaders, TDP activists, alliance leaders, and locals.

