The Desk… Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ యేసుబాబు

The Desk… Tadepalligudem : పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ యేసుబాబు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని 34వ వార్డ్ లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఎంఎల్ఏ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, డిప్యూటీ ఇంజనీర్ పవన్, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ దారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

హాస్టల్స్ తనిఖీ చేసిన కమిషనర్ :

ఈరోజు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 33వ వార్డు 35వ వార్డు లలో ఉన్న హాస్టల్ ను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వసతులను సదుపాయాలను గురించి ఆరా తీశారు. అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి వసతి, ఆహారం, త్రాగునీరు, శానిటేషన్ గురించి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉన్న యెడల తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు హెల్త్ ఆఫీసర్, సానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ASO రజనీ, సానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

కౌన్సిల్ హాలు నందు పన్నుల వసూల్లపై సమీక్ష :

సచివాలయ సిబ్బందిని సత్కరించిన కమిషనర్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన కౌన్సిల్ హాల్ నందు 2025- 2026 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వసూలు విషయంపై సమీక్ష జరిగినది. అత్యధిక శాతం పన్నులు వసూలు చేసిన సచివాలయ అడ్మిన్ సెక్రటరీలను, ఎమినిటీస్ సెక్రటరీలను కమిషనర్ సత్కరించారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులలో వసూళ్లలో 35వ వార్డు మొదటి స్థానంలోనూ, 3వ వార్డు రెండవ స్థానంలోనూ, 2వ వార్డు 3వ స్థానంలోనూ వచ్చాయి. మిగతా సచివాలయాలు కూడా బాగా పనిచేసి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. కార్యక్రమం అనంతరం సచివాలయ సిబ్బందికి గుర్తింపు కార్డులను..కమిషనర్ సిబ్బందికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు మరియు సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Commissioner Yesu Babu Tackles Busy Day in Tadepalligudem

Tadepalligudem Municipal Commissioner Yesu Babu managed a packed schedule today, overseeing key initiatives across the town.

Pension Distribution Event :

In the 34th ward, under the NTR Pension Bharosa scheme, MLA Boleshetty Srinivas distributed pensions with Commissioner Yesu Babu’s guidance. Attendees included Deputy Engineer Pavan, Assistant Engineer Venkateswararao, secretariat staff, pension beneficiaries, and coalition leaders.

Hostel Inspection Drive :

Commissioner Yesu Babu inspected hostels in the 33rd and 35th wards, checking facilities, amenities, food, drinking water, and sanitation. He spoke with students, urging them to report issues promptly. Health Officer, Sanitation Supervisor Someshwararao, ASO Rajani, and sanitation secretaries joined him.

Tax Collection Review and Honors :

At the council hall this evening, Yesu Babu chaired a review of house and property tax collections for 2025-2026. He honored top-performing secretariat admin and amenities secretaries. The 35th ward led, followed by the 3rd and 2nd wards. He urged others to boost municipal growth and issued identity cards to staff. Municipal officials and employees participated.

These efforts highlight Yesu Babu’s commitment to welfare, infrastructure, and revenue enhancement in Tadepalligudem.