The Desk …Rayalaseema : రాయలసీమకు  రాజయోగం..!!

The Desk …Rayalaseema : రాయలసీమకు  రాజయోగం..!!

రానున్నది రాయల కాలం.

మట్టిలో మాణిక్యం… భూమి బంగారం.

సీమ చెంతకు పవర్ ప్రాజెక్టులు.

కందనవోలు ముఖంలో కొత్త కళలు.

కడప గడపలో వెలుగులు.

అనంతలో కోటి కాంతులు.

పంట.. పంటకు వ్యత్యాసాలు.

ఆదుకుంటున్న… యాజమాన్యాలు.

మారుతున్న రైతన్న… తలరాతలు.

రాయలసీమ : ది డెస్క్ :

ఒకప్పుడు రతనాలను రాశులుగా పోసి బజారులో  అమ్మిన ఘనత మనది. కాలం మారింది. కరువు కబళించింది. రాయలసీమను చితికి పోయేలా చేసింది. డొక్కల కరువు దారిద్రాన్ని మిగిల్చింది. అన్నమో రామచంద్రా..అనే దుస్థితికి దిగజార్చింది.

కానీ కాలం అన్నీ వేళలో ఒకేలా ఉండదు. రాయలసీమకు రాజయోగం వచ్చింది. మళ్లీ రాయల కాలం రాబోతుంది. సీమ చెంతకు కొత్త కొత్త  పవర్ ప్రాజెక్టులు   వస్తున్నాయి.మట్టిలో మాణిక్యాలు పండించ బోతున్నాయి. భూమి బంగారమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి.రాయల

సీమ ముఖ ద్వారం కర్నూలు నుంచి ప్రారంభమైన పవర్ ప్రాజెక్టుల పరుగులు అనంతలో కోటి వెలుగులు వెలిగిస్తూ… కడప గడపలో అడుగుపెడుతున్నాయి. అటు నుంచి కర్ణాటకలో ప్రవేశించి దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు నింపుతున్నాయి.

 సోలార్, విండో ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. భవిష్యత్తులో   మానవ మనుగడుకు అవసరమయ్యే విద్యుత్ ఇంధనాన్ని  ముందుగానే సేకరించి  సబ్ స్టేషన్ లలో నిల్వ ఉంచు తున్నాయి. ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి.

పవర్ ప్రాజెక్ట్ లు అంటే పరిశ్రమలో, జాతీయ రహదారిల మాదిరి కాదు. వాటికి అయితే రైతుల భూములను బలవంతంగా నైనా లాక్కుంటారు.పవర్ ప్రాజెక్టుల పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది.సోలార్ కు రైతుల భూములను యాజమాన్యం కేవలం కౌలుకు మాత్రమే తీసుకుంటుంది. భూములను బలవంతంగా తీసుకోదు.

ఇక విండో లకు కొండ, బీడు, పోరంబోకు భూములపై ప్రత్యేక దృష్టి పెడు తుంది.విద్యుత్ ట్రాన్స్ మిషన్ల టవర్ లకు రైతుల నుంచి భూములు కొనడం జరుగదు.రైతుల అంగీకారం తోనే కేవలం టవర్ నాలుగు కాళ్ల కు మాత్రమే భూమి సేకరించడం జరుగుతుంది. అందుకు రైతులకు ఏమాత్రం అన్యాయం జారుకుండా పరిహారం ఇచ్చి యాజమాన్యం ఆదుకుంటుంది. రైతుల నుంచి తీసుకున్న భూమికి హక్కు,అధికారం ఆ రైతుకు ఉండేలా నిర్ణయిస్తుంది.

పంట పంటకు… పరిహార వ్యత్యాసం.

పవర్ ప్రాజెక్టులు సోలార్, విండో, టాన్స్ మిషన్ టవర్ ల ఏర్పాటు లో రైతన్నకు అన్యాయం జరగకుండా చాలా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పంటను బట్టి పరిహారం నిర్ణయిస్తారు. కొన్నిచోట్ల బీడు భూములు ఉండవచ్చు అక్కడ పరిహారం తక్కువగా ఉంటుంది. మరికొన్ని చోట్ల మాగాణులు అంటే నీటిపారుదల భూములకు అయితే పరిహారం వేరుగా ఉంటుంది.

సజ్జ, జొన్న, వేరుశనగ వంటి వర్షాధార పంటలకు నష్టపరిహారం ఆయా ప్రాంతాల్లో భూమి రేట్లు పంటల మార్కెట్ రేట్లు బట్టి  నిర్ణయిస్తారు. ఇక ఉద్యానవన పంటలు మామిడి, చినీ , నేరేడు, జామ దీర్ఘకాలిక పంటల కైతే పరిహారం చాలా అధికంగా అందిస్తారు. గ్రామ,గ్రామానికి, పంట,పంటకు మధ్య పరిహారం విషయంలో చాలా వ్యత్యాసo ఉంటుంది. దీంతో చాలా చోట్ల అయోమయ పరిస్థితి నెలకొంటుంది.

ఆ ఊరి ప్రజలకు అయితే ప్రాజెక్టు యాజమాన్యం వారు అధిక పరిహారం ఇచ్చారని మా ఊరి ప్రజలకు అంతే ఇవ్వాలని చాలా చోట్ల డిమాండ్ పెరిగిపోతుంది. అపోహ కూడా అధికంగా ఉంటుంది. పరిహారం విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చాలా పగడ్బందీగా ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే llఅంచనాలు వేసి అన్నదాతలకు ఆసరా యాజమాన్యాలు నిలుస్తున్నాయి.

 సీమలో మారుతున్న… రైతన్న తలరాతలు.

ఏటా చినుకు రాలక, పంటలు పండక, నిత్యం నేల తల్లిని చూస్తూ  నలిగిపోతున్న రైతన్న కు పవర్ ప్రాజెక్టులు కొండంత అండగా  నిలుస్తున్నాయి. గుండె నిబ్బరాన్ని  పెంచు తున్నాయి. అలిసిపోయిన అన్నదాతకు ఆసరాగా మారుతున్నాయి. పవర్ ప్రాజెక్టు తీసుకున్న కాసింత భూమికి  సరిపడే పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నాయి.

దీంతో ఇన్నాళ్లు కన్నీళ్లు పెట్టిన సీమ ప్రజలకు కొత్త ఆశలు  కలుగుతున్నాయి. ఎలాగో పంటలు కూడా పండని ఈ భూముల్లో కొంత భూమి ఇచ్చి పరిహారము అందుకుని తమ జీవితాలను బాగు చేసుకోవాలని రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమ తలరాతలను తామే మార్చుకుంటున్నారు.

నాడు రతనాల సీమ.. నేడు రాళ్ల  సీమ… మరునాడు మాణిక్య సీమ కాబోతుంది మన రాయలసీమ. పవర్ ప్రాజెక్టులతో భారతదేశానికి వెలుగునిచ్చే కేంద్రంగా మారి దేశానికే సీమ ప్రాంతం ఆదర్శం కాబోతుంది.

ఈ భూముల్లో కొంత భూమి ఇచ్చి పరిహారము అందుకుని తమ జీవితాలను బాగు చేసుకోవాలని రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమ తలరాతలను తామే మార్చుకుంటున్నారు.

నాడు రతనాల సీమ.. నేడు రాళ్ల  సీమ… మరునాడు మాణిక్య సీమ కాబోతుంది మన రాయలసీమ. పవర్ ప్రాజెక్టులతో భారతదేశానికి విద్యుత్ వెలుగులను అందించే కేంద్రంగా రాయలసీమ ప్రాంతం  రాబోయే రోజుల్లో కానుంది.