🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశముల మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు భీమవరం మున్సిపల్ కమిషనర్ సిబ్బంది మరియు ఆహార భద్రతాధికారి కలిసి భీమవరం పట్టణంలో పాల వ్యాపారం చేసే వ్యాపారములు మరియు నెయ్యి తయారు చేసే వివిధ వ్యాపారస్తుల షాప్ లను తనిఖీ చేసి వాటిల్లో ఉన్న కూలింగ్ బాక్సులలో ఉంచినటువంటి పాలను తనిఖీ చేసి అవి కల్తీ కలిగినవని అనుమానించి అందులో శాంపూల్ ను స్వీకరించి తదుపరి నెయ్యి షాపు నందు వివిధ రకములైన క్రీములతో తయారు చేసినటువంటి నెయ్యి పరిశీలించి కల్తీ కలిగినదని అనుమానించి అందులో ఉన్నటువంటి పచ్చిపాల వెన్నను అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచి తయారుచేయడం గమనించి వాటిని తో వెన్నను మరియు నెయ్యిని శాంపుల్ తీసి స్టేట్ ఫుడ్ లాబరేటరీకి పంపించడం జరిగినది.

తదుపరి అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచినటువంటి వెన్నను సీజ్ చేయడం జరిగినది. ఈ యొక్క వ్యాపారస్తులకు ఎటువంటి అనుమతులు పొంది ఉండలేదని కనుక ప్రతి వ్యాపారస్తు మరియు పాలను సేకరించినటువంటి పాల వ్యాపారస్తులు పాలు కలెక్షన్ సెంటర్ లు పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలకు నాణ్యమైన పాలను అందించవలసినదిగా ఆదేశములు జారీ చేయడం అయినది. అందరూ తప్పకుండా అనుమతులు పొంది ఉండవలెను అని లేని యెడల కటినమైన చర్యలు తీసుకొనబడును అని తెలియచేయడం అయినది.

ఆదేవిధముగా ప్రతి వ్యాపారస్తుడు తప్పకుండా మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు సర్టిఫికేట్ తీసుకొనవాలసినదిగా మరియు పట్టణ ప్రజలు మరియు షాప్ యజమానులు ప్లాస్టిక్ సంచులను పూర్తి గా నిషేదించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆదేశములు జారీ చేయడమైనది, ఇందు విషయమైన ఎవరైనా నిర్లక్ష్యం వహించిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకొనబడును అని తెలియచేయడమైనది.
ఈ కార్యకరములో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎ. రాంబాబు, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసు సుందర రామిరెడ్డి, MHO సోమశేఖర్, శానిటరి ఇన్స్పెక్టర్ లు, వార్డ్ సెక్రేటరీలు పాల్గొన్నారు.

