🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఛాంబర్‌లో ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఏసుబాబు మాట్లాడుతూ..
పట్టణంలో సరఫరా చేస్తున్న త్రాగునీటి విషయంలో జాగ్రతలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న అధికారులకు సూచించారు. ప్రతి రోజు సరఫరా చేస్తున్న త్రాగు నీరును అన్ని వార్డులలో క్లోరినేషన్ టెస్ట్ లు చేసి రికార్డ్ లో నమోదు చేయవలసిందిగా ఏమినిటీస్ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా పైప్ లు లీక్ లు లేకుండా చూసుకోవాలని, పట్టణంలోని పబ్లిక్ కుళాయి, పబ్లిక్ బావులు, పబ్లిక్ బోర్ వెల్ లను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లోరినేషన్ చేసి రిజిస్టర్ లో నమోదు చేయవలసిందిగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకట రమణ, మేనేజర్ రవి సుధాకర్, డిప్యూటీ ఇంజనీర్ లు, అసిస్టెంట్ ఇంజనీర్ లు, టాప్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్, వార్డు ఏమినిటీస్ సెక్రెటరీలు పాల్గొన్నారు.
Tadepalligudem Municipality Holds Urgent Water Supply Meeting
The Tadepalligudem Municipal Council convened an emergency meeting in Commissioner Yesubabu’s chamber today to address drinking water supply issues.
Commissioner Yesubabu directed engineering officials to ensure utmost caution in water distribution. He instructed amenities secretaries to conduct daily chlorination tests across all wards, record results, and prevent pipe leaks. Public taps, wells, and borewells must be regularly inspected, chlorinated, and logged.
Participants included Municipal Commissioner Yesubabu, Engineer Venkata Ramana, Manager Ravi Sudhakar, deputy and assistant engineers, top inspector, meter readers, and ward amenities secretaries.

