The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి…”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”

The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి…”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”

🔴 పగో జిల్లా : ది డెస్క్ :

“ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” అనే కార్యక్రమం పురపాలక సంఘ కార్యాలయము నందు ఉదయం 10:30 నుండి 1:00 వరకు జరుపబడుతుంది.

ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకొని వాటి యొక్క ప్రయారిటీ ప్రకారం సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాం.

మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చినప్పుడు సమస్య చెప్పిన వెంటనే .. మీ సమస్య యొక్క స్పాట్ వద్దకు వచ్చి పరిష్కార మార్గాలు చూసి పరిష్కరిస్తారు.

అదేవిధంగా మీ ఇంటి నుండి వచ్చే తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందచేయండి. రోడ్లమీద గాని డ్రెయిన్ మీద గాని వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

వచ్చే నెల నుండి తాడేపల్లిగూడెం పట్టణానికి స్వచ్ఛభారత్ టీం వస్తుంది కాబట్టి…సంబంధించిన టీం వచ్చినప్పుడు మీకు ఐవిఆర్ ఫోన్ కాల్స్ వస్తాయి.. అంటే..

మీ పట్టణం పరిశుభ్రంగా ఉందా అని అడిగితే ఉందని చెప్పాలి.

శుభ్రతలో మీరు భాగస్వాములు అయ్యారా అని అడిగితే అయ్యామని చెప్పాలి..

మీ పరిసర ప్రాంతాల్లో చెత్తను 24 గంటల్లో పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారా అని అడిగితే తొలగిస్తున్నారని చెప్పాలి.

డ్రైన్లు క్లీన్ చేస్తున్నారా అని అడిగితే చేస్తున్నామని…

అలా మంచి పాజిటివ్ రిపోర్టు మనం ఇవ్వగలిగితే స్వచ్ఛభారత్ లో.. పురపాలక సంఘ డెవలప్మెంట్ కొరకు నిధులు కోట్లాది రూపాయలు వచ్చే అవకాశం ఉంది.. దీని విధంగా పారిశుధ్యాన్ని ఇంకా మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుంది.

ప్రజలందరూ కూడా ఈ రకమైన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మన పట్టణానికి రాష్ట్రంలోనే స్వచ్ఛభారత్ మొదటి స్థానం వచ్చే విధంగా సహకరించి భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాము.

మరియు ప్రతి నెల రెండవ ఆదివారం నాలుగో ఆదివారం ఎస్వీఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డ్ వద్ద హ్యాపీ సండే కార్యక్రమం జరుపుతున్నాము..

పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాము.

ప్రజలందరూ కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినప్పుడు పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన తాడేపల్లిగూడెం పట్టణం ప్లాస్టిక్ రహిత పట్టణముగా చేయాలని ముందడుగు వేస్తున్నాము.

పట్టణ ప్రజలు ఏదైనా షాపింగ్ కొరకు వెళ్ళినప్పుడు.. వారు క్యారీ బ్యాగ్ లో మీకు సంబంధించిన ఐటమ్స్ ఇచ్చినప్పుడు, మా ప్రాణాలతో ఆటలాడవద్దు మేము వీటిని తిరస్కరిస్తున్నాము మాకు ఈ క్యారీ బ్యాగులు వద్దు.. గుడ్డ సంచులను మాత్రమే ఇవ్వండి అని వ్యాపారస్తులతో ప్రజలు చెప్పినప్పుడు అవేర్నెస్ వస్తుంది.

ఈ రోజున కాలువల్లో గాని డ్రైన్లో గాని ప్లాస్టిక్ కవర్లు వేయడం వలన దోమలు ఏర్పడి, ఆ దోమలు మరల మీ గృహాల్లో సంచరించి, కు, ప్రాణాంతక వ్యాధులుగా మారి ఆసుపత్రిలో చేరడం జరుగుతుంది.

పట్టణంలో ప్రతి రోడ్లను, డ్రైన్లను పరిశుభ్రంగా ఉంచుతున్నాము .

ముఖ్యంగా పట్టణంలో ఉన్న ప్రజలు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్నులు గాని నీటి పన్నులు గాని ఖాళీ స్థలం పన్నులు గాని మీ వ్యక్తిగత బాధ్యతగా సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము.

BPS..LRS స్కీము ప్రభుత్వం ప్రవేశపెట్టింది..మీరు ఏదైనా బిల్డింగ్ కట్టవలసి వచ్చినప్పుడు డివియేషన్స్ ఉంటాయి.. కొన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు.. వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి మంచి అవకాశం ఉంది. దీనికి మార్చి 11 వరకు ఆఖరి తేది కాబట్టి ఈలోపు దీనికి సంబంధించి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా నాన్ లేఅవుట్ ఫ్లాట్లు కూడా కొనుక్కుని ఉంటారు దీనికి LRS స్కీము ద్వారా వాటి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

అదేవిధంగా రీ సర్వే కార్యక్రమం జరుగుతుంది.. మీ ఆస్తికి సంబంధించి డిజిటల్ కార్డు మీకు అందిస్తారు.. మా సచివాలయ సెక్రటరీలు మీ వద్దకు వచ్చినప్పుడు మీ డాక్యుమెంట్ నెంబరు మా సిబ్బందికి ఇస్తే వారు ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేసి మీకు డిజిటల్ కార్డు అందజేస్తారు. ఈ సర్వే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యి సహకరించి ఈ పట్టణ అభివృద్ధికి మీ సహకారం అందించాలని కోరుతున్నాం

“Praja Samasyala Parishkara Vedika”

Tadepalligudem Municipality Urges Residents for Cleanliness, Civic Participation

Tadepalligudem Municipality in West Godavari district has issued a comprehensive appeal to residents, emphasizing weekly grievance redressal, Swachh Bharat compliance, and timely tax payments to boost town development. The notice, released by the Commissioner, outlines initiatives to resolve public issues on-site and promote a plastic-free environment.

Grievance Redressal Platform :.

Every Monday from 10:30 AM to 1:00 PM, the “Praja Samasya Parishkara Vedika” operates at the municipal office. Residents must submit written complaints for prioritized action, with officials visiting spots immediately for solutions. This hands-on approach aims to address local concerns efficiently.

Swachh Bharat Drive :.

With the Swachh Bharat team arriving next month, residents are advised to segregate wet and dry waste at home and hand it to sanitation workers, avoiding roads or drains. During IVR calls, affirm cleanliness efforts: town is clean, you’re a partner, waste cleared in 24 hours, and drains maintained. Positive feedback could secure crores in funds for development and top state ranking.

Community Events :

“Happy Sunday” programs occur on the second and fourth Sundays at SVR Circle Housing Board. Attendance fosters town progress toward plastic-free status. Shoppers should reject plastic carry bags, demanding cloth alternatives to raise awareness and prevent mosquito breeding in drains, curbing diseases.

Tax Compliance and Schemes :

Pay house, water, and vacant land taxes promptly to support municipal growth. The government’s BPS-LRS scheme regularizes unauthorized constructions and non-layout flats; deadline is March 11—apply soon amid low statewide response. A re-survey issues digital property cards; cooperate with secretariat staff by providing documents for photos and app uploads.

This citizen-centric push aligns with Tadepalligudem’s Selection Grade status, covering 50.71 sq km and serving over 130,000 residents The municipality maintains roads, drains, and waste management, urging collective responsibility for a cleaner, thriving town