🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ప్రతి సోమవారం ఉదయం 10 : 30 గంటల నుండి 1:00 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం తాడేపల్లిగూడెం పురపాల సంఘ కార్యాలయంలో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రజల అనేక మంది వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, పట్టణంలోని సమస్యలను ఈ కార్యక్రమం దృష్టికి తీసుకువస్తే సత్వరమే వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించి, అధికారులను పర్యవేక్షణకు పంపించి తగు రీతిలో సమస్యలను పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటున్నాము.
అదేవిధంగా పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా తెలియపరిచేది ఏమిటంటే మీ ఇంటి నుండి వచ్చే తడిచెత్త – పొడిచెత్త వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందచేయండి అంతేకానీ రోడ్లమీద, కాలువల్లోనూ, డ్రైన్లలోను పారవేయవద్దు.
అదేవిధంగా మీకున్న సమస్యలు నిమిత్తం పురమిత్ర యాప్ ద్వారా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్ లో అనేక రకాల ఫిర్యాదులు ఉంటాయి..
యాప్ ద్వారా టాక్స్ కూడా అందులో చెల్లించవచ్చు. యాప్ ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు పురపాలక సంఘ అభివృద్ధికి సహాయ పడాలని… అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం పట్టణంలో పైలెట్ ప్రాజెక్టుగా రి సర్వే ప్రాజెక్టును ప్రారంభించింది.
మీ ఆస్తికి సంబంధించి మీకు డిజిటల్ కార్డు అందజేస్తాము.. దీనికి సంబంధించి సెక్రటరీలు మీ వద్దకు వచ్చినప్పుడు మీ ఆస్తికి సంబంధించి జిరాక్స్ కాపీ వారికి అందించి, ఆధార్ డీటెయిల్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది. తదుపరి మీ ఇంటిని, మీ ఆస్తిని ఫోటో తీసి.. మీకు ఒక డిజిటల్ కార్డు మీకు అందచేస్తారు.
ఆ డిజిటల్ కార్డు మీరు బ్యాంకు కి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళినప్పుడు మీకు లోన్ అనేది సులభంగా మంజూరు అవుతుంది. అర్బన్ ఏరియా లో ఉన్న రైతులు కానీ గృహస్తులు కానీ ఈ సర్వే నిమిత్తం వచ్చే సెక్రటరీలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రస్తుతం ఫ్యామిలీ సర్వే జరుగుతుంది.. ఇంకా ఎవరైనా చేయకుండా ఉన్నవారు ఈ సర్వే రెండు రోజుల్లో చేయించుకోవాలి.
ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు కానీ బెనిఫిట్స్ కానీ కావాలంటే ఖచ్చితంగా రీసర్వేలో నమోదయి ఉండాల్సిందే..
ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికెట్ గాని ఇన్కమ్ సర్టిఫికెట్ గాని అప్లై చేయాలని భావిస్తే.. వారు తప్పకుండా రీసర్వేలో వారి పేరు నమోదు అయి ఉండాల్సిందేనని..
ప్రజలంతా మీ పరిసరాలను పరిశ్రమంగా ఉంచుకుని, స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు రావాలంటే..
అమరావతి నుండి వచ్చే ఐవిఆర్ ఫోన్ కాల్స్ కు పాజిటివ్ గా రిజల్ట్ రావాలంటే..
అంటే మీ పట్టణం పరిశుభ్రంగా ఉందా..? అంటే ఉందని..
అలాగే మీ చెత్తను 24 గంటల్లోపు పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారా..? అంటే తొలగిస్తున్నారని..
అదేవిధంగా మీ ఇంటికి ప్రతిరోజు పరిశుద్ధ కార్మికులు వస్తున్నారా..? అంటే వస్తున్నారని..
మీ ఇంటి తడి, పొడి చెత్త విడదీసి ఇస్తున్నారా..? అంటే ఇస్తున్నామని..
అలా పాజిటివ్ రిపోర్టు చెప్పినప్పుడు రాష్ట్రంలోనే మన తాడేపల్లిగూడెం పట్టణం మొదటి స్థానంలో ఉంటుందని.. దీనికి ప్రజలందరూ సహకారం ఎంతో అవసరమని, కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులై పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము.

ఇట్లు :
కమిషనర్
పురపాలక సంఘం (తాడేపల్లిగూడెం)
Tadepalligudem Municipal Council Urges Residents for Cleanliness, Surveys, and Civic Engagement.
Tadepalligudem Municipality in West Godavari district has issued an appeal to residents, emphasizing
weekly grievance redressal, waste management, and cooperation in state surveys.The council highlights ongoing initiatives to resolve public issues swiftly and boost urban development.
Weekly Grievance Forum :
Every Monday from 10:30 AM to 1:00 PM, the ‘Praja Samasya Pariskara Vedika’ operates at the Tadepalligudem Purapala Sangha office. Residents can present personal or town-level problems, prompting immediate action including official inspections and resolutions. This program, similar to ongoing PGRS efforts, ensures quick redressal.
Waste Management Drive :
Citizens must segregate wet and dry waste at home and hand it to sanitation workers, avoiding roads, drains, or sewers. The council stresses 24-hour waste clearance and daily worker visits to maintain cleanliness. Positive responses to Amravati IVR calls on hygiene could rank Tadepalligudem first statewide.
Digital Tools and Surveys :
Download the Puramitra app for complaints, tax payments with discounts, and services like sanitation and drainage reporting. The state launched Tadepalligudem as the first pilot for the Re-Survey project, issuing digital cards using property xerox, Aadhaar details, and photos for easy bank loans. Ongoing family surveys require completion within two days for welfare benefits, caste/income certificates.
Commissioner Purapalaka Sangha calls for full cooperation to achieve top cleanliness ranks and urban progress.

