The Desk … Eluru : ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ➖MLA చంటి

The Desk … Eluru : ప్రజారోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ➖MLA చంటి

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :

ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధకనపరుస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇవాల్టివరకూ అవసరార్థులకు సహాయం అందించడంలో ఎంతో సమర్థవంతంగా స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతోన్న 32మంది బాధితులకు మంజూరైన 19లక్షల, 84వేల, 56 రూపాయల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను, 2లక్షల, 87వేల, 336 రూపాయల విలువైన రెండు ఎల్‌వోసీ కాపీలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మీడియాతో మాట్లాడుతూ…

అనారోగ్యంతో బాధపడుతోన్న వారికి తక్షణ సాయం అందించే విషయంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటూ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యతను కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని..ఆ దిశగానే తాము అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు.

ఈకార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్చార్జిలు , డివిజన్ ఇన్చార్జిలు పలువురు పాల్గొన్నారు.

Eluru MLA Distributes ₹22.7 Lakh in Health Aid from CM Relief Fund

TDP district president and Eluru MLA Badeti Chanti highlighted the coalition government’s special focus on public health protection during a cheque distribution programme at his camp office in Powerpeta on Wednesday.

He handed over cheques worth ₹19.84 lakh from the Chief Minister’s Relief Fund to 32 ailing constituents in the Assembly segment, along with two LOC copies valued at ₹2.87 lakh. MLA Chanti assured support, emphasizing prompt aid as per CM Chandrababu Naidu’s directives.

Speaking to the media, he said, “We’re prioritizing health alongside welfare and development to elevate living standards responsibly.

“APKAB Chairman Ganni Viranjaneyulu and others participated. The event underscores TDP’s commitment to grassroots healthcare.