జాతీయ జెండాను ఆవిష్కరించి పతాక వందనం చేసిన ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
మండలంలోని ఆటపాక గ్రామంలో గల నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కైకలూరు మాజీ శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించి పతాక వందనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ :-
నేడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా మనందరం ఈ గణతంత్ర దినోత్సవం ను పెద్ద పండుగగా ఘనంగా జరుపుకుంటామనీ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతూ విలువలను కాపాడాలనీ.. కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

