The Desk … Gollapudi : దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంనందు ఘనంగా గణతంత్ర వేడుకలు

The Desk … Gollapudi : దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంనందు ఘనంగా గణతంత్ర వేడుకలు

🔴 అమరావతి : గొల్లపూడి : ది డెస్క్ :

77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం నందు జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు.

సందర్బముగా కమీషనరు రామచంద్రమోహన్ మాట్లాడుతూ..

ప్రధాన కార్యాలయము నందు ఫైల్సు పెండెన్సీ సాధ్యమైనంత వరకు పూర్తి చేసియున్నామని, ఆదేవిధముగా ప్రధాన కార్యాలయమునకు సమస్యల పై వచ్చిన అర్జీ దారులు/ప్రజలు తో మర్యాదపూర్వకముగా మాట్లాడి వారి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుటకు ప్రయత్నించవలసినదిగా సిబ్బంది మరియు అధికారులకు సూచించారు. మరియు ఉద్యోగుల సర్వీసు విషయములో సమస్యలను చాలా వరకు పరిష్కరించి వారికి పదోన్నతులు కల్పించామని, రాబోవు రోజుల్లో పూర్తిగా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలియజేసారు. శాఖ నందు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించు దిశగా అందరూ పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ సానుకూలంగా స్పందిస్తున్న కమిషనర్ కు ఉద్యోగుల సంఘం తరపున సంఘం నాయకులు ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు తెలిపారు.

Republic Day Celebrated with Pomp at Endowments HQ

Amaravati: Gollapudi (The Desk) :

The 77th Republic Day was marked with grandeur at the Endowments Department headquarters, where officials hoisted the national flag in a solemn ceremony.Commissioner Ramachandramohan, addressing the gathering, highlighted efforts to clear file pendency to the maximum extent. He directed staff and officers to handle public grievances courteously and resolve them swiftly. Noting that most employee service issues have been addressed with promotions granted, he assured full resolution soon. The department prioritizes rapid public problem-solving, urging all to work towards it.