🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్ :

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర.త్రినాధరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తిని, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక సిబ్బంది, వ్రత పురోహితులు, ఎస్పీఎఫ్ మరియు సెక్యూరిటీ సిబ్బంది, భక్తులు పాల్గొని దేశానికి గౌరవం చాటారు. స్వామివారి ఆశీస్సులతో దేశం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు.
Annavaram Temple Hoists Tricolour on Republic Day
Veer Venkata Satyanarayana Swamy Devasthanam celebrated Republic Day with grandeur. Temple EO Vendra TrinadhaRao unfurled the national flag, urging patriotism and unity. Officials, priests, security staff, and devotees paid homage, praying for India’s prosperity and peace under divine blessings.

