- రహదారి భద్రతా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలి
🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : దుగ్గిరాల : ది డెస్క్ :

37 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగముగా సోమవారం దుగ్గిరాలలోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలోని NSS మరియు NCC విద్యార్థులను వాలంటీరులుగా ఎంపిక చేసి రహదారి భద్రత నియమాలపై వారికి మోటారు వాహన తనిఖీ అధికారి ఎస్.జగదీష్ బాబు ఆధ్వర్యములో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి రవాణా శాఖ నిర్వహించే అన్ని రహదారి భద్రతా కార్యక్రమాల్లో వీరు కూడా భాగస్వాములు అవుతారని జగదీశ్ అన్నారు.

సోమవారం భీమడోలు, గుండుగొలను కూడళ్ళలో మరియు చొదిమెళ్ల డిటిసి కార్యాలయం వద్ద మోటారు వాహన తనిఖీ అధికారులు ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ఉపయోగాలు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు.
ప్రధానముగా సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతి వేగం, మద్యం సేవించి మరియు ట్రిపుల్ డ్రైవింగ్ చేయకుడం వలనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమములో మోటారు వాహన తనిఖీ అధికారులు జి.స్వామి, వి.ఎల్.కళ్యాణి, ఎస్.జగదీష్ బాబు, ఎన్.నెహ్రు డి.ప్రజ్ఞ ఉన్నారు.
Duggirala Road Safety Awareness Drives Students into Action
In the 37th National Road Safety Month, NSS and NCC students from a private degree college here were selected as volunteers Monday. Motor Vehicle Inspector S. Jagadeesh Babu trained them on road safety rules, urging their participation in all upcoming Transport Department programs.
Meanwhile, MVIs conducted awareness sessions for two-wheeler riders at Bhimadole, Gundugolanu, Koodal, and Chodimella DTC office. They emphasized helmet use, valid licenses, insurance benefits, and warned against signal jumping, mobile use while driving, overspeeding, drunk driving, and triple riding—key causes of accidents.
Participants included MVIs G. Swamy, V.L. Kalyani, S. Jagadeesh Babu, N. Nehru, and D. Prajna.

