The Desk…Vunguturu : 31నే పెన్షన్ ల పంపిణీ.. ఒకరోజు ముందుగా..!! ➖MPDO మనోజ్

The Desk…Vunguturu : 31నే పెన్షన్ ల పంపిణీ.. ఒకరోజు ముందుగా..!! ➖MPDO మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈనెల ఒకరోజు ముందుగా డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ తెలియజేశారు.

సందర్భంగా ఎంపీడీవో మనోజ్ మాట్లాడుతూ..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులతో బ్యాంకు మేనేజర్లతో ఈరోజు మాట్లాడారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ పంపిణీ అధికారులకు అందుబాటులో ఉండి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు అందరూ 30వ తేదీన ఆయా బ్యాంకుల నుండి పెన్షన్ నగదు డ్రా చేసి మంగళవారం సాయంత్రానికి ఏర్పాటు చేయవలసిందిగా పంచాయతీ కార్యదర్శులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. వివిధ పనుల మీద వేరే ప్రాంతాలు వెళ్లిన పెన్షన్ లబ్ధిదారులు 31 తేదీన ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు.

Advances NTR Bharosa Pensions by One Day

NTR Bharosa pensions for January will be distributed a day early on December 31, Unguturu Mandal Parishad Development Officer (MPDO) G.R. Manoj announced today.

In a teleconference with panchayat secretaries and bank managers, Manoj instructed officials to disburse pensions from 6 a.m. to 6 p.m. on Monday. Beneficiaries must be available at home, especially those away for work, he urged. Secretaries were directed to draw cash from banks on December 30 and prepare by Tuesday evening, per government orders.