The Desk…Mudinepalli : కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలి : సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లకు అంబుల వైష్ణవి మరోమారు వినతి

The Desk…Mudinepalli : కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలి : సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లకు అంబుల వైష్ణవి మరోమారు వినతి

🔴 ఏలూరు జిల్లా : మదినేపల్లి మండలం : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణ జిల్లాలో కలపాలంటూ అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో కలుపుతుందని అన్ని మండలాల ప్రజలు ఆశించారన్నారు.

అయితే నియోజవర్గం విలీనం ప్రక్రియ పెండింగులో పెట్టినట్లు వచ్చిన వార్తలతో ఆందోళన చెందుతున్నట్లు ఆమె ప్రకటించారు. విలీనం ప్రక్రియ త్వరితగతిన పూర్తి అయ్యేలా దీనిపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వైష్ణవి మరోమారు లేఖలో విన్నవించారు.