వీడియో కాన్అఫరెన్స్ లో అధికారులతో డిఆర్వో విశ్వేశ్వరరావు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతిరహితంగా బాధ్యతలు నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో అవినీతి నిరోధక శాఖ చట్టాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిఆర్ఓ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ…
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ప్రజా సేవకులని, ప్రజల సేవలో అవినీతికి పాల్పడకూడదన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులున్నా, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినా శిక్షార్హమని, అవినీతి నిరోధక శాఖ చట్టాల ననుసరించి శిక్షించడం జరుగుతుందన్నారు.
ACB ఉమ్మడి పగో జిల్లా డిఎస్పీ వి. సుబ్బరాజు మాట్లాడుతూ..
సమాజంలో అవినీతి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు గత వారం రోజుల నుండి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరియు ముఖ్యమైన సెంటర్లలో ACB టోల్ ఫ్రీ నంబర్ (1064) మరియు అవినీతి నిరోధక శాఖ పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి సమాచారాన్ని 1064 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 9440446157 లేదా 9440446158 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కాన్ఫరెన్స్ లో అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్లు M.బాలకృష్ణ, K. శ్రీనివాసు, ప్రభృతులు పాల్గొన్నారు.

