- లింగ సమానత్వంపై “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాం
- నార్వే లో పర్యటించనున్న భారత ఎంపీల బృందం
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో, ఆదేశ రాజధాని ఓస్లో లో నవంబర్ 2నుంచి 8వరకూ జరగబోయే సదస్సు, నార్వే ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరవుతున్నారు.
ఈ సదస్సుకు ఆహ్వానిస్తూ గతనెల 24న ఎంపీకి ఆహ్వానం అందగా, భారతదేశం తరపున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఏడుగురు ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
తాజాగా నార్వే పర్యటనకు ఆధికారికంగా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏలూరు ఎంపీకి బుధవారం లేఖ అందింది. “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాంలో భాగంగా జరిగే ఈ పర్యటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా భారత ప్రతినిధి బృందం వారం రోజులపాటు నార్వే లోని ఓస్లో, ట్రోంసో నగరాల్లో పర్యటించనుంది.

