🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భముగా రోడ్ స్టేఫ్టీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోతే, పోయేది ఒక ప్రాణం మాత్రమే కాదు ఒక కుటుంబం రోడ్డున పడుతుందని మనం జాగ్రత్తగా నడిపి మరొకరి నిర్లక్ష్య దోరణి ప్రమాదానికి కారణం కావచ్చని, నిర్దేశించిన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అందరూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. హైవేను అనుకొని వున్న ఆశ్రం హాస్పిటల్ ద్వారా రోడ్డు, ప్రమాదం సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను, ర్యాపిడ్ ట్రామా రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటుచేసి క్షతగాత్రులకు సరైన మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కోరారు.
ఆశ్రం హాస్పిటల్, సి.ఇ.ఓ డా|| కె. హనుమంతరావు మాట్లాడుతూ… అవగాహన కల్పించడం మా బాధ్యతని..తప్పకుండా ఎస్.పి సూచనల మేరకు ర్యాపిడ్ ట్రామా టీమ్నుఏర్పాటు చేస్తామని గత 25 సంవత్సరాలు ఎంతోమంది క్షతగాత్రులకు అత్యత్తమ వైద్య సేవలు అందజేయగలిగామని తెలిపారు. మన సిబ్బంది కాని వారి రక్త సంబంధులు కాని రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డారో గుర్తుచేసి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డా॥ ప్రణయ్ మాట్లాడుతూ… గోల్డెన్ అవర్ సమయంలో చికిత్స అందించడం చాలా అవసరమని తద్వారా తలకు తగిలిన దెబ్బలకు కాని, ఎముకలు విరిగినప్పుడుగాని కడుపుకు తగిలే గాయాలకు కాని శస్త్ర చికిత్స అందించి సరైన సమయంలో సరైన వైద్యం అందజేయవచ్చని ప్రజలకు అవగాహన లేక ఆలస్యంగా రావడం వలన ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోవడం లేక అంగవైకల్యం రావడం జరుగుతుందని తెలిపారు.
ఈ ర్యాలీ ఆశ్రం హాస్సిటల్ నుండి మొదలై పాతబస్టాండ్, జ్యూట్మిల్, ఫైర్ స్టేషన్, సత్రంపాడు, వట్లూరు, రెడ్డి మహిళా కళాశాల నుండి కలపర్రు టోల్ గేట్ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరి అక్కడి నుండి తిరిగి మరలా ఆశ్రం హాస్పిటల్నకు తిరిగి రావడం జరిగింది. ఆశ్రం హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ, స్టాఫ్, ఆశ్రం ఆటో డ్రైవర్లు, బైక్పై వాలంటీర్లు సుమారు 200 పైగా సిబ్బంది పాల్గొన్నారు.గ్రూప్ సి.ఓ.ఓ రాజా రాజన్, మెడికల్ సూపరింటెండ్ డా॥ కె. శాంతయ్య, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెండ్ డా॥ హరీష్ గౌతమ్ ట్రామా టీమ్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆశ్రం ఆటోయూనియన్, కార్యవర్గ సభ్యులు త్రినాథ్ నేతృత్వంలో ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. క్రమశిక్షణతో ర్యాలీలో భాగస్వాములైన ఆటో యూనియన్ సభ్యులకు సి.ఇ.ఓ హనుమంతరావు కృతజ్ఞతలు తెలియజేసారు.