ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

రాష్ట్ర గౌడ సంఘ నాయకులు పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు కైకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోలగాని నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం కైకలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

పోసిన జన్మదినం సందర్భంగా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పేదలకు అన్నదానంతోపాటు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు రాష్ట్ర గౌడ సంఘ నాయకుడు పరాసా ఏడుకొండలు, జిల్లా అధ్యక్షుడు పరసా వీర్రాజు చేతుల మీదుగా రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం కైకలూరు పట్టణంలోని ఎస్టీ కాలనీ నందు నివసిస్తున్న పేదలకు మరియు అంగన్వాడిలోని చిన్నారులకు రొట్టెలు, పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామారావు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఆపద అని వచ్చినవారికి సమస్య ఏదైనా పరిష్కారం చూపే నేత రామారావు అని ప్రశంసించారు. అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని తామరకొల్లు వృద్ధుల వృద్ధాశ్రమానికి రాష్ట్ర గౌడ సంఘ నాయకులు పోసిన చెంచు రామారావు జన్మదినోత్సవం సందర్భంగా 3 బియ్యం కట్టలు వితరణ చేశారు.
కార్యక్రమంలో కైకలూరు మండల అధ్యక్షుడు కట్టా నాగబాబు, మండవల్లి మండలం అధ్యక్షుడు బొర్రా సత్యనారాయణ, కలిదిండి మండలం అధ్యక్షుడు కట్టా పాండు రంగారావు, యార్లగడ్డ శంకర్, యార్లగడ్డ నెహ్రూ, పడమట గణేష్, మారగాని గణపతి, కట్టా నాని, శొంఠి రాజేశ్వరి, రాణి, చిల్లుముంత గణపతి, నాగబాబు దాసరి శ్రీనివాసరావు, వీరంకి సత్యనారాయణ, సింహాద్రి కేదార్, తదితర గౌడ సంఘ నేతలు పాల్గొన్నారు.