The Desk…Machilipatnam : సముద్రంలో స్నానానికి వెళ్లి మునిగిపోతున్న యువకులను రక్షించిన మెరైన్ పోలీసులు

The Desk…Machilipatnam : సముద్రంలో స్నానానికి వెళ్లి మునిగిపోతున్న యువకులను రక్షించిన మెరైన్ పోలీసులు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : మంగినపూడి బీచ్ : ది డెస్క్ :

బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ లో ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుండి వచ్చిన యాత్రికులతో కోలాహలంగా కిటలాడింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో మెరైన్ సిబ్బంది జాగ్రత్తలు చెబుతూ పలు సూచనలు అందించారు.

కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు సముద్ర తీరప్రాంతంలో అలల తాకిడికి బీచ్ లోకి కొట్టుకుపోయారు. ఘటనను గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో… అబ్దుల్ అసిఫ్, ఎండి అన్వర్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్ అనే యువకులను ప్రాణాలకు తెగించి కాపాడారు.

మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడారని యువకులు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన చొరవకు పర్యాటకులు అభినందనలు తెలిపారు.