The Desk…Kaikaluru : నిబంధనలు పాటిస్తూ బాణాసంచా విక్రయాలు జరుపుకోవాలి : కైకలూరు రూరల్ సీఐ రవికుమార్

The Desk…Kaikaluru : నిబంధనలు పాటిస్తూ బాణాసంచా విక్రయాలు జరుపుకోవాలి : కైకలూరు రూరల్ సీఐ రవికుమార్

ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : ది డెస్క్ :

బాణాసంచా విక్రయదారులు పోలీసు వారి నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ టపాసులు విక్రయించాలని కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాణాసంచా ఉక్రియదారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

దీపావళి దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రతా నియమాలు :

🧯 1. లైసెన్స్, స్థానం :

దుకాణానికి తప్పనిసరిగా Explosives Rules, 2008 ప్రకారం లైసెన్స్ (Form LE-5) ఉండాలి.

వాసస్థలాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు మొదలైన వాటి నుండి కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాలి.

తాత్కాలిక షెడ్లు మాత్రమే అనుమతించబడతాయి (శాశ్వత భవనాలు కాదు).

రెండు దుకాణాల మధ్య కనీస దూరం 3 మీటర్లు ఉండాలి.

హైటెన్షన్ లైన్లు లేదా LPG గోడౌన్ల సమీపంలో ఉండకూడదు.

🔥 2. నిర్మాణం, ఏర్పాట్లు :

షెడ్ టిన్ షీట్లు లేదా GI షీట్లతో నిర్మించాలి. చెక్క, బట్ట, ప్లాస్టిక్ వాడకూడదు.

షెడ్ గాలి ప్రసరించే విధంగా ఒక వైపు తెరిచి ఉండాలి.

ఇసుక బకెట్లు మరియు నీటి బకెట్లు (కనీసం 2 చొప్పున) ప్రవేశద్వారం వద్ద ఉంచాలి.

ఎలక్ట్రిక్ వైరింగ్ సురక్షితంగా ఉండాలి — కరెంటు వైర్లు అతుకులుగా ఉండకూడదు. సురక్షితమైన ఇన్సులేటర్లను వాడాలి.

వైర్లను బయటకు వేలాడతీయకూడదు వంటి పలు సూచనలు చేశారు.