సెల్యూట్ – శక్తి టీమ్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ (ఐపీఎస్) యొక్క ఆధ్వర్యంలో…శక్తి దళం సేవలు అనిర్వచనీయం అని చెప్పాలి. పేరులోనే ఉంది శక్తి దళం..
ఒక మహిళను నిజమైన శక్తిగా తయారు చేసిన ఏలూరు శక్తి టీమ్ పోలీసులకు సెల్యూట్ చెప్పాల్సిందే…
పోలీసు శాఖ అందిస్తున్న శక్తి టీం సేవలు వల్ల ఒక వ్యక్తి జీవితం ఎలా టర్న్ అయ్యిందో తెలుసుకుందాం.
పూర్తి వివరాల్లోకి వెళితే… సరిగ్గా నాలుగు నెలల క్రితం కుటుంబ సమస్యలతో కలత చెందిన ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు 112 ద్వారా కంట్రోల్ రూమ్ కి సమాచారం రాగా… శక్తి టీం బృందం ఉమెన్ కానిస్టేబుల్ సుజాత తో కలసి… సదరు మహిళ కదలికలను గమనించి, గుర్తించి ఆమెను ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాగా.. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సదరు మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆమె ఆశయ సాధనకు కావలసిన మానసిక స్తైర్యాన్ని, మనో ధైర్యాన్ని చెప్పి బ్రెయిన్ వాష్ చేయగా… సదరు మహిళ ఆత్మహత్యాయత్నం ఆలోచన విరమించుకుని, తన లైఫ్ స్టైల్ ని మార్చుకుని ఎందరికో రోల్ మోడల్ గా నిలిచారు. కొద్ది రోజుల్లోనే… ఇటీవల నిర్వహించిన DSC పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయురాలిగా ఆమె ఎంపికయ్యారు.

మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ… (నేటి చిత్రం)
శక్తి టీం సభ్యుల సకాలంలో స్పందించి, తనను రక్షించి కౌన్సిలింగ్ ఇవ్వడం వలననే… నేను సజీవంగా ఉన్నాను. ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉందని శక్తి టీం సభ్యులకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు.