The Desk…Ghantasala : పిల్లల్లో ఊబకాయం రాకుండా తల్లులు జాగ్రత్త వహించాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ టి.రమా నాగమణి

The Desk…Ghantasala : పిల్లల్లో ఊబకాయం రాకుండా తల్లులు జాగ్రత్త వహించాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ టి.రమా నాగమణి

కృష్ణా జిల్లా : ఘంటసాల : ది డెస్క్ :

పిల్లల్లో ఊబకాయం రాకుండా తల్లులు జాగ్రత్త వహించాలని ఐసీడీఎస్ ఘంటసాల సెక్టార్ సూపర్ వైజర్ టి.రమా నాగమణి అన్నారు.

ఘంటసాల 1 అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ రమా నాగమణి మాట్లాడుతూ.. ఊబకాయం గురించి తల్లులకు అవగాహన కల్పించారు.

ఆహారంలో చక్కెర, నూనె వాడకం తగ్గించాలని, పిల్లలను పాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని, కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) తాగించకూడదన్నారు. పిల్లలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం పెట్టడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని రమా నాగమణి తల్లులకు తెలియజేశారు.

కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సునీత, ఇతర అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, సిబ్బంది పాల్గొన్నారు.