The Desk…Eluru : ఆదుకున్న ఎంపీకి రుణపడి ఉంటాం ➖‎తలసేమియా బాధిత బాలిక తల్లిదండ్రులు

The Desk…Eluru : ఆదుకున్న ఎంపీకి రుణపడి ఉంటాం ➖‎తలసేమియా బాధిత బాలిక తల్లిదండ్రులు

🔴 ఏలూరు జిల్లా : ఎంపి కార్యాలయం : ది డెస్క్ :‎

మానవత్వానికి చిరునామాగా పుట్టా మహేష్ కుమార్ – తలసేమియా బాలిక వైద్యానికి 13 లక్షల భారీ ఆర్ధిక సహాయం.- పీఎంఎన్ఆర్ఎఫ్, సీఎస్ఆర్ ల నుంచి నిధులు మంజూరు చేయించిన ఎంపీ.- కృతజ్ఞతలు చెప్పిన బాలిక కుటుంబసభ్యులు.‎తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తమ ఆరేళ్ల కుమార్తెకు బోన్ మ్యారో చికిత్స కోసం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 3 లక్షలు స్వయంగా ఇప్పించడమే కాకుండా, సీఎస్ఆర్ ద్వారా 10 లక్షల సాయం అందటానికి కూడా కృషి చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్లా దుర్గాప్రసాద్ దంపతులు.ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్లా దుర్గాప్రసాద్ దంపతుల కుమార్తె తలసేమియాతో బాధపడుతున్న సంగతి స్థానిక ఏఎంసీ మాజీ ఛైర్మన్ విజయ్ కుమార్ దృష్టికి రాగా, ఆయన బాలిక పరిస్థితిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.  వెంటనే స్పందించిన ఎంపీ ప్రధానమంత్రి ఆఫీసు అధికారులతో మాట్లాడి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 3 లక్షల నిధులు విడుదల చేయించారు. అంతేగాకుండా, తలసేమియా బాల సేవా యోజన కింద కోల్ ఇండియా వారి ద్వారా సీఎస్ఆర్ కింద మరో 10 లక్షలు మంజూరుకు కృషి చేశారు.

ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. భారీ ఖర్చుతో కూడుకున్న తమ కుమార్తె వైద్యం కోసం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారని, పీఎంఎన్ఆర్ఎఫ్, సీఎస్ఆర్ వంటివాటి గురించి ఏమాత్రం తెలియని తమకు ఎంపీ కృషితో 13 లక్షలు మంజూరు అయ్యాయని,ఎంపీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

నెలనెలా రక్త మార్పిడి కోసం ఇప్పటికే అప్పులపాలై కుమార్తె ఆపరేషన్ కు సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్న తమను ఎంపీ వద్దకు తీసుకువెళ్ళి ఆర్ధిక సాయం అందించిన ఉంగుటూరు గ్రామ కూటమి నాయకులకు కూడా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.‎‎