మీడియా సమావేశంలో వెల్లడించిన ఏలూరు డిఎస్పి
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
గణేష్ నిమజ్జనాల ఊరేగింపు నేపథ్యంలో.. కైకలూరు టౌన్లో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలకు సంబంధించి స్థానిక కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏలూరు డిఎస్పి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ మీడియా పాయింట్స్…
- వినాయక నిమజ్జనం సందర్భంగా కాపులు బజారు వద్ద ఊరేగింపులో స్వల్ప ఘర్షణ జరిగింది స్వల్ప ఘర్షణను కొందరు కులాల మధ్య ఘర్షణగా మార్చారు.
- వినాయకుని ఊరేగింపు జరుగుతుండగా దానగూడెం కు చెందిన అజయ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులతో కలిసి రేషన్ బియ్యం కొరకు అటువైపుగా వెళుతు బండి హార్న్ మోగించడం వలన అక్కడ యువకుల మధ్య వాగ్వాదాలు జరిగాయి.
- ఈ వాగ్వాదాలు శృతిమించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి బాధిత యువకుడు అజయ్, అతనితో వచ్చిన యువకులకు, ఘర్షణ విషయం తెలిసి అక్కడికి వచ్చిన బాధితుడి అక్క, తల్లి మరికొందరు కట్టనా స్థలానికి వచ్చారు.
- ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో అజయ్ అతనితోపాటు ఉన్న వ్యక్తి కి గాయాలయ్యాయి..
- గాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించాము.
- పథకం ప్రకారం దాన గూడెం నుండి కొందరు వచ్చి రాళ్లతో దాడి జరిపారు.
- పోలీసులు ఇరు వర్గాల వారిని చదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
- బాధితుడు పైఎద్దుల అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.
- దాడి చేసిన నిందితులను సాయంత్రం 5గంటలకు అదుపులోకి తీసుకున్నాం.
- పథకం ప్రకారమే కొంతమంది వ్యక్తులు ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు జరపాల్సి ఉంది.
- ఉద్దేశపూర్వకంగా స్వప్రయోజనాల కోసం కుల, వర్గాల మధ్య విద్వేషాలు రేపినట్లు దర్యాప్తులో తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం.
- ఇదే అదునుగా కొందరు సోషల్ మీడియా ద్వారా కులకర్షణలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు.
- అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
- 150 మంది పోలీసులతో గట్టి బందోబస్తు చేస్తున్నాం.
- పెట్రోలింగ్, పికెటింగ్ ముమ్మరంగా ఏర్పాటు చేశాం.
- బాధితులను పరామర్శ పేరుతో కుల, వర్గాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.
- ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను విడిచి పెట్టే ప్రసక్తే లేదు.
- డ్రోన్ల ద్వారా, సిసి ఫుటేజీల ద్వారా ఈ ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తిస్తాం.
- చట్టం పరిధిలో వారిపై కఠిన చర్యలు ఉంటాయి.