- ఉప్పుటేరు ప్రక్షాళన పనులు, నీటి ప్రవాహాన్ని సంయుక్త పరిశీలనలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డా. కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఉప్పుటేరు ప్రక్షాళన పనులు మరియు నీటి ప్రవాహాన్ని శనివారం గురువాయిపాలెం పంచాయితీ మధ్వానిగూడెం, చిన్న తాడినాడ, సోమేశ్వరం, ఉప్పుటేరు గ్రామాలు, ఉప్పుటేరు, తదితర ప్రాంతాల్లో ప్రక్షాళన పనులు మరియు గుర్రపుడెక్క,కిక్కిస తొలగింపు పనులను అధికారులు, ఇంజనీరింగు బృందం, నీటి సంఘాలు చైర్మన్లు, డైరెక్టర్లుతో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ఏ ఒక్క గ్రామం వరద ముప్పు బారిన పడకుండా ఉప్పుటేరు ప్రక్షాళన పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామం ముప్పు బారిన పడటానికి వీల్లేదని, అందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తుందన్నారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో కొల్లేరులోకి పెద్ద ఎత్తున వరద చేరుతుందని అన్నారు.
ఈ నీరంతా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళవలసి ఉందని, అయితే గుర్రపు డెక్క, తూడు మేటలు వేయటం వలన ఈ ప్రవాహానికి విగాథం కలిగిస్తుంది అన్నారు. ఉప్పుటేరు ప్రక్షాళన పనులు పూర్తిచేసి ఈ ప్రాంత వాసులకు ఎటువంటి ముప్పు బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉప్పుటేరు ప్రక్షాళనకు శాసనసభ ఉపసభాపతి,ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, భీమవరం జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, 50 సంవత్సరాలలో జరగని ఉప్పుటేరు ప్రక్షాళన పనులు ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.
ఇంజనీరింగు బృందం,అధికారులు, నీటి సంఘాలు నాయకులు సంయమనంతో పని చాలా తొందరగానే జరుతుందని సంతోషం వ్యక్తం చేశారు.అలానే నియోజక వర్గంలోని డ్రైన్లలో కూడా ఎక్కడ గుర్రపుడెక్క గాని తూడు గాని లేకుండా ఎప్పటికప్పుడు మెషిన్లతో మరియు గట్ల మీద మెషిన్లతో రాత్రి పగలు అధికారులు, నాయకులు చిత్తం శుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.
ఉప్పుటేరు ప్రక్షాళన పనులు వేగవంతంగా సాగుతున్నాయని ముంపుకు ఎక్కడ కూడా ఆస్కారం ఉండదని నీటి ప్రవాహం బాగానే ఉందని రాబోయే రోజులలో మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వీరి వెంట ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష,పిషరీష్ డిడి బి.నరసయ్య,ఇంజనీరింగు బృందం, తహశీల్దారు యం.డి ఇబ్రహీం, ఇంచార్చి యంపిడివో ఆర్.ఫణీంద్ర, నీటి సంఘాలు చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు,స్థానిక నాయకులు,స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

