🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన టీడీపీ పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసే నిమిత్తం ప్రతిపాదనలను స్వీకరించేందుకు నియోజకవర్గాల వారిగా త్రిసభ్య కమిటీల నియామకం చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా 24/8/25 ఆదివారం ఏలూరు పట్టణంలోని క్రాంతి కళ్యాణ మండపంలో జరిగే ఏలూరు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొననున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రి గొట్టిపాటి రవి, బుద్దా నాగ జగదీష్, ఎం.ఎస్. రాజు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
సమావేశంలో మంత్రి పార్థసారథి, ఏలూరు పార్లమెంటు పరిధిలోని టీడీపీ శాసన సభ్యులు, ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. కమిటీల ఏర్పాటుపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నాయకులతో చర్చించనున్నారు.

