ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
రాష్ట్రంలో ఉన్న అర్హులైన దివ్యాంగులకు జీవనాధారంగా ఉన్న పెన్షన్లను తొలగించడం అన్యాయమని కైకలూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను సవరిస్తూ.. కొందరు దివ్యాంగులకు పెన్షన్లు తొలగించబడిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం కైకలూరులోని స్థానిక ఏలూరు రోడ్ లోని వైకాపా పార్టీ కార్యాలయంలో డిఎన్ఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో డిఎన్ఆర్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో సుమారుగా 4736 మంది దివ్యాంగులకు పెన్షన్లను తొలగించారని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 1,25 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లను తొలగించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
దివ్యాంగులు, చిన్నపిల్లలు దేవుడితో సమానమని.. పెన్షనే వారికి జీవనాధారం అన్నారు. 10 సంవత్సరాలుగా 80% – 85% ఉన్న వైకల్యం ఇప్పటికీప్పుడు 20% -25%నికి ఎలా మారుతుందని నిలదీశారు. పెన్షన్లను తొలగించి మళ్లీ అర్జీలు పెట్టుకోండని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
దివ్యాంగుల అధికారులు చుట్టూ తిప్పుతూ వారిని ఇబ్బంది పెట్టడం అమానుష్యమన్నారు. ఇప్పటికైనా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే లు అర్హులై ఉండి.. నోటీసులు అందుకున్న దివ్యాంగులకు తోడుగా నిలిచి వారిని ఆదుకోవాలని మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
సమావేశంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి&ముదినేపల్లి మండలం ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి& మండవల్లి మండలం ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్(రాము), రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి & కలిదిండి మండలం ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు (ఉమా), రాష్ట్ర మేధావుల విభాగ కార్యదర్శి బుసనబోయిన వెంకటేశ్వరరావు(B.V RAO), కైకలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాంబాబు(రాము), కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమని రమేష్, మండవల్లి మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి ఏశావు రాజు, ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రామరాజు, కైకలూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు సమయం రామాంజనేయులు(అంజి), జిల్లా మేధావులు విభాగ ప్రధాన కార్యదర్శి పంజా రామారావు, జిల్లా ప్రచార విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కన్నా రమేష్, జిల్లా బూత్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పంజా నాగు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు మండా నవీన్, బుసనబోయిన శ్రీనివాస్(చావలిపాడు శ్రీను), కన్నా బాబు తదితరులు పాల్గొన్నారు.