The Desk…Mudinepalli : భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో భార్య అదృశ్యం… పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు

The Desk…Mudinepalli : భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో భార్య అదృశ్యం… పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు

ఏలూరు జిల్లా : ముదినేపల్లి (క్రైమ్) : ది డెస్క్ :

భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యమైన ఘటన మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీహరిపురం గ్రామానికి చెందిన సనకా రవీంద్రకు కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన లక్ష్మీ శిరీష కు 13 సంవత్సరాల క్రితం వివాహం అయింది.

రవీంద్ర తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వారు ఇరువురికి ఒక కుమారుడు కుమార్తె సంతానం. భార్యాభర్తలు ఇద్దరికీ ఇటీవల కాలంలో మనస్పర్ధలు ఏర్పడి తరచూ గొడవలు పడుతూ.. భార్య శిరీష ఇరువురి పిల్లలను తీసుకుని కోరుకొల్లులోని పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండేది. అలా వెళ్ళినప్పుడల్లా భర్త రవీంద్ర సిరిష వద్దకు వెళ్లి మళ్లీ ఇంటికి తీసుకు వచ్చేవాడు.

ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం శిరీష తన పిల్లలను తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్ళి పోవడంతో భర్త నరేంద్ర అత్తమామలకు ఫోన్ చేసి అడగగా.. శిరీష ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో నరేంద్ర పలుచోట్ల వెతికిన భార్య ఆచూకీ తెలియకపోవడంతో.. సోమవారం ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో భార్య పిల్లల అదృశ్యంపై ఫిర్యాదు చేయగా.. ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.