ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

భారత దేశ ఐక్యతను చాటి చెప్పేందుకు ప్రధాని మోడీ పిలుపు మేరకు ఏపీ సీఏం చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటిగా కలసి తమ తమ నివాస ప్రాంతాలలోని గృహాలపై జాతీయజెండాని ఎగరవేద్దామని అంబుల వైష్ణవి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపించి, పేదరికం లేని నవసమాజ నవ్యాంద్ర నిర్మాణం కోసం, మన భావితరాల కోసం అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలని మన వంతుగా ₹116/- రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా అందించి.. నవ్యాంద్ర ప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై.. ప్రపంచ దేశాలలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆదర్శంగా నిలపాలని.. తెలుగింటి ఆంధ్రుల ఆడపడుచుగా మీ వంతుగా సహాయం అందించాలని కోరుతున్నానన్నారు.