The Desk…Machilipatnam : కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు

The Desk…Machilipatnam : కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

నేటి సమాజంలో పెరుగుతున్న డిజిటల్ మరియు సైబర్ నేరాల పై అవగాహన మరియు రహదారి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి, వివిధ రకాల నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పలు అంశాలు గురించి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు బుధవారం మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు వివరించారు.

▪️అక్కడ విద్యార్థులు అందరితో కాసేపు సరదాగా ముచ్చటించి వారితో ముఖాముఖి మాట్లాడి పోలీస్ శాఖ పట్ల వారికి ఉన్న అనుమానాలను సందేహాలను అడిగి నివృత్తి చేశారు.

ఎస్పీ మాట్లాడుతూ ..

▪️సమాజంలో నేడు జరుగుతున్న డిజిటల్, సైబర్ నేరాలు, ఇతర రకాల నేరాల గురించి విద్యార్థులకు వివరిస్తూ, అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం, ఫేక్ లింకులు క్లిక్ చేయడం ,సోషల్ మీడియా దుర్వినియోగం వంటి విషయాలపై అంశాలపై స్పష్టతనిచ్చారు.

▪️ అరెస్ట్ అంటే కేవలం భౌతికంగా చేసేదే గాని ఫోన్ కాల్స్ ద్వారా సాంకేతికత ఆధారంగా చేసేది కాదని, డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులను మీ తోటి వారిని చైతన్యం చేయాలని తెలిపారు.

▪️మన వ్యక్తిగత రహస్యాల గోప్యతే మనల్ని సైబర్ నేరాల బారిన పడకుండా రక్షిస్తుందని కనుక మీ సమాచారాన్ని వీలైనంత గోప్యంగా ఉంచాలని తెలిపారు.

▪️ప్రజల రక్షణ కోసం పోలీసు వారి యొక్క చట్టాల గురించి తెలియజేస్తూ ఐపిసి, సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్ రూపాంతరం చెంది ప్రస్తుతం (భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక సురక్ష సంహిత , భారతీయ సాక్ష్య అధినీయం) గా మారాయని తెలిపారు.

▪️చదువుకునే వయసులో విద్యార్థులు దుర్వ్యసనాల మాయలో పడి చిక్కుకోవద్దని, గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల వినియోగం వంటి వాటికి దూరంగా ఉండాలని వాటిని వినియోగించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలియజేశారు.

▪️మీ లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని, అందరికీ ఆదర్శంగా మీ ఆలోచనలు ఉండాలని, ఈ వయసులో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని దిశా నిర్దేశం చేశారు.

▪️అలాగే రహదారి భద్రతపై మాట్లాడుతూ… ట్రాఫిక్ నియమాల పాటింపుతో మన ప్రాణాలు మనమే రక్షించుకోవచ్చని తెలిపారు. మైనర్ల వాహనాలు వినియోగించే రాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ లు ధరించి వాహనాలు నడపాలని, తాగి వాహనం నడపడం వంటి నేరాలపై చట్టపరమైన పరిణామాలను వివరించారు.

▪️విద్యార్థుల్లో సరైన అవగాహన కలిగినపుడే భవిష్యత్ సమాజం సురక్షితంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.