The Desk…Eluru : మద్యం సేవించి వాహనాలు నడిపే 10 మంది పై కేసులు నమోదు…

The Desk…Eluru : మద్యం సేవించి వాహనాలు నడిపే 10 మంది పై కేసులు నమోదు…

  • నలుగురికి మూడు రోజులపాటు సామాజిక సేవ, ముగ్గురుకి జరిమానా విధించిన కోర్టు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాలపై ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తన సిబ్బందితో కలసి ఈనెల 2న ఏలూరు పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు కేసులు నమోదు చేశారు.

(మంగళవారం) నేడు ఈ కేసుల్లో 7 మందిని ఏలూరు 2వ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా.. వారిపై చార్జ్‌ షీట్ ఫైల్ చేసినారు. రీడింగ్ ఎక్కువగా వచ్చిన 4గురు వ్యక్తులు 3 రోజుల పాటు సామాజిక సేవలు చేయాలి అనే ఆదేశాన్ని మేజిస్ట్రేట్ K.V.R మల్లేశ్వరి జారీ చేశారు. వారు ట్రాఫిక్ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ కు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన ముగ్గురుకు అపరాధ రుసుములు విధించబడ్డాయి.

ఈ సందర్భంగా ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వలన నడిపే వారే కాదు, ఎదుటి వారు కూడా ప్రమాదానికి గురవుతారని, ప్రతి ఒక్కరి జీవితానికి కుటుంబం ఆధారంగా ఉంటుంది.

మీరు ప్రపంచానికి ఒక్కడివే కాకపోయినా, మీ కుటుంబానికి మీరు ముఖ్యం. మద్యం సేవించ కుండా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఆలోచించాలని సూచించారు.