- కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ ప్రక్రియ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
కృష్ణాజిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : మచిలీపట్నం : ది డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం ఉదయం నుండి PGRS (మీ కోసం) హాల్ నందు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు, మహిళా పోలీసులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు సజావుగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
▪️ ఈ బదిలీలను ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే చేస్తామని, బదిలీలు కోరుకునే వారు తన స్వగ్రామం/వార్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని, ఖాళీల వారీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ప్లే నందు ఉంచామని, అందులో మీకు నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం మీకే ఉందని తెలిపారు.
▪️ఈ రోజు నిర్వహించిన బదిలీల్లో వారి ర్యాంకుల ఆధారంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పౌస్ కోటా, దివ్యాంగుల కోటా మరియు ఆరోగ్య పరమైన సమస్యలు ప్రాతిపదికన బదిలీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది.
▪️ ఈరోజు మొత్తం మొత్తం సుమారు 400 మందికి పైగా మహిళా పోలీసులు ఆఫ్ లైన్/ఆన్లైన్లో బదిలీ కొరకు దరఖాస్తు చేసుకొని కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు .
▪️ కొంతమంది కోరుకున్న ప్రదేశాలలోకి బదిలీ కోరగా, మరికొంత మంది యధావిధి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలిపారు. సదరు బదిలీల నివేదికను జిల్లా కలెక్టర్ గారికి పంపి తద్వారా వారికి పోస్టింగ్ ఆర్డర్ కాపీలు అందజేయడం జరుగుతుంది.
▪️ ఈ బదిలీ ప్రక్రియ అంత పూర్తిపారదర్శకంగా ఏ విధమైన ప్రలోభాలు అవకాశం లేకుండా నిర్వహించడం జరుగుతుందని కనుక మీకు కేటాయించిన ప్రదేశాలలో యధావిధిగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
▪️అనంతరం ఈ కౌన్సిలింగ్ లో పాల్గొన్న మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు భోజనం ఏర్పాటు చేయించారు.
ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, AO M.M సుబ్రమణ్యం, AAO యంగన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.